KL Rahul: నేను అడుక్కునే రకం కాదు.. రాహుల్ కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించి..
ABN, Publish Date - Nov 13 , 2024 | 07:49 AM
KL Rahul: ఐపీఎల్ 2025కు ముందు మెగా ఆక్షన్ జరగనుంది. త్వరలో జరిగే వేలంలో ఏయే ప్లేయర్ ఎంత ధరకు అమ్ముడుపోతాడనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈసారి కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి భారత స్టార్లు బరిలో ఉండటంతో కొత్త రికార్డులు క్రియేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ 2025కు ముందు మెగా ఆక్షన్ జరగనుంది. త్వరలో జరిగే వేలంలో ఏయే ప్లేయర్ ఎంత ధరకు అమ్ముడుపోతాడనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈసారి కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి భారత స్టార్లు బరిలో ఉండటంతో కొత్త రికార్డులు క్రియేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మీద అందరి ఫోకస్ ఉంది. లక్నో సూపర్ జియాంట్స్‌కు కెప్టెన్‌గా ఉన్న రాహుల్.. ఆ జట్టును వీడి వేలం బరిలోకి దిగాడు. అతడి మీద కోట్ల వర్షం కురవడం ఖాయమని, కనీసం రూ.30 కోట్ల ధర పలికే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నమ్మితే నిలబడతా
ఐపీఎల్ ఆక్షన్ కోసం ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తున్నానని రాహుల్ అన్నాడు. లీగ్‌లో తన ప్రయాణాన్ని కొత్తగా మొదలుపెట్టాలని అనుకుంటున్నానని చెప్పాడు. సరికొత్త ఛాన్సులను అన్వేషించాలని భావిస్తున్నానని తెలిపాడు. తనకు స్వేచ్ఛ కావాలని చెప్పిన టీమిండియా స్టార్.. అది దొరికే చోటే ఆడాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. కెప్టెన్సీ పక్కా కావాలి అని డిమాండ్ చేయనని.. ఒకవేళ ఇస్తే మాత్రం తీసుకుంటానని స్పష్టం చేశాడు. తన నాయకత్వం, సామర్థ్యంపై నమ్మకం ఉండి, జట్టును బాగా నడిపించగలడని వాళ్లు నమ్మి బాధ్యతలు అప్పగిస్తే తప్పకుండా స్వీకరిస్తానని చెప్పుకొచ్చాడు రాహుల్.
గెలిచినా, ఓడినా ఒకేలా..
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ టీమ్స్ చాలా స్పెషల్ అని రాహుల్ అన్నాడు. ఆ మూడు జట్ల డ్రెస్సింగ్ రూమ్ చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుందన్నాడు. గెలిచినా, ఓడినా ఆ జట్ల ఆటగాళ్లు కూల్‌గా ఉంటారని, అక్కడి వాతావరణం అలా ఉంటుందన్నాడు. ముంబై టీమ్‌ను రోహిత్ తయారు చేశాడని మెచ్చుకున్నాడు రాహుల్. అక్కడ ఫెంటాస్టిక్ ఎన్విరాన్‌మెంట్, కల్చర్‌ను అతడు క్రియేట్ చేశాడని.. 5 కప్పులు రావడానికి పూర్తి క్రెడిట్ హిట్‌మ్యాన్‌కే దక్కుతుందన్నాడు. టీమిండియా ఈ రేంజ్‌లో సక్సెస్ అవడానికి కూడా అతడే కారణమన్నాడు. అతడి నుంచి ప్రతి ఒక్కరూ ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తారని వివరించాడు రాహుల్. కాగా, కెప్టెన్సీ కోసం అడుక్కోనని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. బహుశా గత ఫ్రాంచైజీ లక్నోను ఉద్దేశించే అతడు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడని అంటున్నారు. తాను అడగలేదని, వాళ్లే ఆ బాధ్యతలు ఇచ్చారని క్లారిటీ ఇవ్వాలనే ఇలా వ్యాఖ్యానించాడని చెబుతున్నారు.
Also Read:
హాకీ అమ్మాయిల రెండో గెలుపు
అర్జున్ అదరహో
భారత్ ఎందుకు రాదో.. కారణాలు చెప్పండి?
For More Sports And Telugu News
Updated Date - Nov 13 , 2024 | 07:52 AM