ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lizelle Lee: 75 బంతుల్లో 150 నాటౌట్.. బాదుడులో రోహిత్‌ను మించిపోయిందిగా..

ABN, Publish Date - Nov 10 , 2024 | 09:22 AM

ఈతరం క్రికెటర్లలో బాదుడు అంటే ముందుగా గుర్తుకొచ్చేది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మే. తొలి బంతి నుంచి బౌండరీలు, సిక్సులతో శివాలెత్తడం అతడికి అలవాటు. అయితే హిట్‌మ్యాన్‌ను మించిపోయేలా బాదుడుకు కొత్త డెఫినిషన్ ఇస్తూ ఓ మహిళా క్రికెటర్ అద్భుతంగా ఆడింది.

ఈతరం క్రికెటర్లలో బాదుడు అంటే ముందుగా గుర్తుకొచ్చేది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మే. తొలి బంతి నుంచి బౌండరీలు, సిక్సులతో శివాలెత్తడం అతడికి అలవాటు. క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లకు నరకం చూపిస్తాడు హిట్‌మ్యాన్. జాలి, దయ లేకుండా విధ్వంసం సృష్టిస్తాడు. బౌలర్ ఎవరు, పిచ్ ఎలా ఉంది.. లాంటి ఈక్వేషన్స్ పట్టించుకోకుండా చెలరేగిపోతాడు. వచ్చిన బౌలర్‌ను వచ్చినట్లు ఊచకోత కోస్తాడు. రోహిత్‌కు బౌలింగ్ చేయాలంటేనే బౌలర్లు దడుసుకుంటారు. అయితే హిట్‌మ్యాన్‌ను మించిపోయేలా బాదుడుకు కొత్త డెఫినిషన్ ఇస్తూ ఓ మహిళా క్రికెటర్ అదరగొట్టింది. 75 బంతుల్లోనే ఏకంగా 150 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడింది.


ఇది మామూలు ఊచకోత కాదు

విమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతం చోటుచేసుకుంది. హోబర్ట్ హరికేన్స్- పెర్త్ స్కార్చర్స్ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ నమోదైంది. హోబర్ట్ బ్యాటర్ లీజెల్లీ లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఫోర్లు, సిక్సులతో అపోజిషన్ టీమ్ బౌలర్ల మీద విరుచుకుపడింది. ఫస్ట్ ఓవర్ నుంచే హిట్టింగ్ మొదలుపెట్టిన లీజెల్లీ.. ఆఖరి వరకు అదే ఊపును కంటిన్యూ చేసింది. మొత్తంగా 75 బంతుల్లో 150 పరుగులు చేసిన ఆమె నాటౌట్‌గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలతో పాటు 12 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే లీజెల్లీ ఊచకోత ఏ రేంజ్‌లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.


నీళ్లు తాగినంత ఈజీగా..

లీజెల్లీ 200 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసింది. వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీకి తరలిచేందుకు ప్రయత్నించింది. నిలబడిన చోటు నుంచే టెక్నిక్, బ్యాట్ స్వింగ్, టైమింగ్‌ను నమ్ముకొని నీళ్లు తాగినంత ఈజీగా భారీ సిక్సులు బాదింది లీజెల్లీ. కనికరం అనేది లేకుండా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థులను వణికించింది. ఆమె ఆటను చూసిన నెటిజన్స్.. ఉతుకుడులో రోహిత్‌ను మించిపోయిందిగా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పించ్ హిట్టర్లు ఉంటే ఎంతటి తోపు బౌలర్ అయినా ఏమీ చేయలేరని అంటున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హరికేన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన స్కార్చర్స్ 19.3 ఓవర్లలో 131 పరుగులకు చాప చుట్టేసింది.


Also Read:

ఆసీస్ సిరీస్‌లో రోహిత్ ఆడతాడా లేదా.. తేల్చేసిన రితికా

టాప్‌ లేపాల్సిందే

హర్మన్‌, శ్రీజే్‌షకు ఎఫ్‌ఐహెచ్‌ స్టార్‌ అవార్డులు

For More Sports And Telugu News

Updated Date - Nov 10 , 2024 | 09:25 AM