ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yash Thakur: ఐపీఎల్ 2024లో యశ్ ఠాకూర్ సెన్సేషనల్ రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి బౌలర్

ABN, Publish Date - Apr 08 , 2024 | 11:15 AM

యువ బౌలర్ యశ్ ఠాకూర్ ఓ సంచలన రికార్డ్ సృష్టించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎవ్వరికీ సాధ్యం కాని ఫీట్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి, మెయిడెన్ ఓవర్ చేసిన బౌలర్‌గా అవతరించాడు.

యువ బౌలర్ యశ్ ఠాకూర్ (Yash Thakur) ఓ సంచలన రికార్డ్ సృష్టించాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎవ్వరికీ సాధ్యం కాని ఫీట్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. ఆదివారం (07-04-24) గుజరాత్ టైటాన్స్‌తో (Gujarat Titans) జరిగిన మ్యాచ్‌లో ఈ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఆటగాడు.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి, మెయిడెన్ ఓవర్ చేసిన బౌలర్‌గా అవతరించాడు. ఐపీఎల్ 2024లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బౌలర్ ఇతడే! అంతేకాదు.. ఈ సీజన్‌లో తొలి ఫైఫర్ (ఐదు వికెట్లు) తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసిన అతడు.. ప్రత్యర్థి జట్టుని చావుదెబ్బ కొట్టి, గుజరాత్ జట్టు పతనంలో ప్రధాన పాత్ర పోషించాడు. అందుకే.. యశ్‌కి ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డ్ దక్కింది.

హార్దిక్ పాండ్యా ఎందుకు బౌలింగ్ చేయలేదు.. ముంబై కెప్టెన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. స్టోయినిస్ (58) (Marcus Stoinis) అర్థశతకంతో రాణిస్తే.. కేఎల్ రాహుల్ (33) (KL Rahul), పూరన్ (32), బిష్ణోయి (20) పర్వాలేదనిపించారు. ఇక 164 పరుగుల లక్ష్యంతో దిగిన గుజరాత్ జట్టు.. 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదట్లో గుజరాత్ ఓపెనర్లు శుభారంభమే అందించారు. కానీ.. జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఔట్ అయ్యాక ఆ జట్టు పతనం మొదలైంది. బ్యాటర్లందరూ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. రాహుల్ తేవాతియా (30) (Rahul Tewatia) ఒక్కడే పోరాటపటిమ కనబరిచాడు కానీ, మిగతా బ్యాటర్లు మాత్రం చేతులెత్తేశారు. ఈ దెబ్బకు.. గుజరాత్ జట్టు 130 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది. ఐపీఎల్‌లో గుజరాత్ చేసిన రెండో అత్యల్ప స్కోరు ఇదే.

చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన తొలి జట్టు

లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్‌తో పాటు కృనాల్ పాండ్యా (Krunal Pandya) కూడా అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక నవీన్ ఉల్ హక్ (Naveen Ul Haq), రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో లక్నో జట్టు హ్యాట్రిక్ హిట్ నమోదు చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో మూడో స్థానంలో నిల్చొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 11:15 AM

Advertising
Advertising