ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Marcus Stoinis: స్టొయినిస్ మెరుపు ఇన్నింగ్స్.. పాక్ బౌలర్లకు నరకం చూపించాడు

ABN, Publish Date - Nov 18 , 2024 | 05:18 PM

Marcus Stoinis: ఊచకోత అంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు చూపించాడు మార్కస్ స్టొయినిస్. పిడుగొచ్చి మీద పడ్డట్లు దాయాది బౌలర్ల మీద పడ్డాడీ ఆసీస్ హిట్టర్. దొరికిన బాల్‌ను దొరికినట్లు స్టాండ్స్‌లోకి తరలించాడు.

PAK vs AUS: ఊచకోత అంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు చూపించాడు మార్కస్ స్టొయినిస్. పిడుగొచ్చి మీద పడ్డట్లు దాయాది బౌలర్ల మీద పడ్డాడీ ఆసీస్ హిట్టర్. దొరికిన బాల్‌ను దొరికినట్లు స్టాండ్స్‌లోకి తరలించాడు. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడాల్లేకుండా అందర్నీ ఉతికిఆరేశాడు. హారిస్ రౌఫ్, షాహిన్ అఫ్రిదీకి చుక్కలు చూపించాడు. భారీ సిక్సులతో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు స్టొయినిస్. అతడి మాస్ బ్యాటింగ్ కారణంగా ఆఖరి టీ20లో 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది ఆసీస్.


పెవిలియన్‌కు క్యూ

మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు 18.1 ఓవర్లకు 117 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్ ఆజం (41) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. హషీబుల్లా ఖాన్ (24) మంచి స్టార్ట్ అందుకున్నా భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. వీళ్లిద్దర్నీ మినహాయిస్తే మిగతా బ్యాటర్లంతా ఫెయిల్ అయ్యారు. సాహిబ్‌జాదా ఫర్హాన్ (9), ఉస్మాన్ ఖాన్ (3), సల్మాన్ అలీ అఘా (1), ఇర్పాన్ ఖాన్ (10), అబ్బాస్ అఫ్రిదీ (1) దారుణంగా ఆడారు. ఆడమ్ జంపా (2/11), ఆరోన్ హార్డీ (3/21), స్పెన్సర్ జాన్సన్ (2/24) పాక్ బ్యాటర్లను వణికించారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి పనిబట్టారు.


ఎవ్వరినీ వదల్లేదు

తక్కువ స్కోరును ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. 11.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 118 పరుగులు చేసింది. స్టొయినిస్‌తో పాటు జోష్ ఇంగ్లిస్ (27) రాణించారు. మ్యాచ్ మొత్తానికి స్టొయినిస్ ఇన్నింగ్సే హైలైట్. 225 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అతడు.. 5 బౌండరీలు, 5 భారీ సిక్సులు బాదాడు. రౌఫ్ బౌలింగ్‌లో అతడు కొట్టిన బిగ్ సిక్స్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. పవర్ హిట్టింగ్‌తో ఈజీ టార్గెట్‌ను మరింత ఈజీ చేసేశాడతను. దయ అనేదే లేకుండా పాక్ బౌలర్లను చీల్చి చెండాడాడు. అందుకే అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్‌ ఆసాంతం రాణించి, పాక్‌ను వైట్‌వాష్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ స్పెన్సర్ జాన్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం లభించింది.


Also Read:

గంభీర్‌ను దింపేసేందుకు ఆసీస్ కుట్ర.. గట్టిగానే ప్లాన్ చేశారు

కొకైన్ తీసుకుని మ్యాచ్ ఆడి.. అడ్డంగా బుక్కైన క్రికెటర్‌..

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు పుజారా.. కానీ సూపర్ ట్విస్ట్

For More Sports And Telugu News

Updated Date - Nov 18 , 2024 | 05:30 PM