MI vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ముంబై.. తుది జట్లు ఇవే!
ABN, Publish Date - Apr 22 , 2024 | 07:27 PM
ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో.. ముంబై జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఈ స్టేడియంలో ముంబై, రాజస్థాన్ జట్టు ఏడుసార్లు తలపడగా..
ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో.. ముంబై జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఈ స్టేడియంలో ముంబై, రాజస్థాన్ జట్టు ఏడుసార్లు తలపడగా.. ఐదుసార్లు ఆర్ఆర్ జట్టు గెలుపొందింది. అంటే.. ఈ మైదానంలో తమదే ఆధిపత్యమని రాజస్థాన్ చాటిచెప్పింది. చివరిసారిగా ముంబై ఈ మైదానంలో 2012లో గెలిచింది. అప్పటి నుంచి ఓడిపోతూ వస్తోంది. అయితే.. ఐపీఎల్ చరిత్రలో ఇరుజట్ల మధ్య జరిగిన పోరాటంలో ఎక్కు విజయాలు ముంబై ఖాతాలోనే ఉన్నాయి. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఇరుజట్ల మధ్య 29 మ్యాచ్‌లు జరగ్గా.. ముంబై 15, రాజస్థాన్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం లేదు.
ఇదిలావుండగా.. ఈ సీజన్‌లో రాజస్థాన్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ.. విరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆర్ఆర్.. ఆరు విజయాలు నమోదు చేసి, ఒక్క మ్యాచ్‌లో (గుజరాత్‌పై) మాత్రం ఓటమి చవిచూసింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఈ జట్టు అగ్రస్థానంలో ఉంది. మరోవైపు.. ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ సీజన్‌ని హ్యాట్రిక్ ఓటములతో ప్రారంభించిన ముంబై, ఆ తర్వాత పుంజుకొని మూడు విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన ముంబై.. మూడు విజయాలే సాధించింది. ఈ నేపథ్యంలోనే.. ముంబై జట్టు మంచి కసి మీద ఉంది. ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని చూస్తోంది. అటు.. రాజస్థాన్ కూడా తన జైత్రయాత్రని కొనసాగించాలని చూస్తోంది. మరి.. తాజాగా ఇరుజట్ల మధ్య జరుగుతున్న పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, నేహాల్ వాధేరా, జెరాల్డ్ కోయిట్జీ, మహమ్మద్ నబీ, పియుష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, రోవ్‌మన్ పోవెల్, షిమ్రోన్ హెట్‌మేయర్, ధ్రువ్ జురేల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
Updated Date - Apr 22 , 2024 | 07:27 PM