ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KKR vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

ABN, Publish Date - May 11 , 2024 | 09:05 PM

ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం సాయంత్రం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది.

ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. వరుణుడి కారణంగా మ్యాచ్ చాలా ఆలస్యం అయ్యింది. 7:30 గంటలకు ప్రారంభమవ్వాల్సిన ఈ మ్యాచ్.. వర్షం దెబ్బకు 9:15 గంటలకు ప్రారంభమైంది. దీంతో.. మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు.


కాగా.. ముంబై ఇప్పటికే అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది కాబట్టి.. ఈ మ్యాచ్‌లో ఓడినా నష్టం లేదు, గెలిచినా ఒనగూరేదేమీ ఉండదు. కాకపోతే.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటి, తన పరువు కాపాడుకోవాలని ముంబై భావిస్తోంది. మరోవైపు.. ఈ సీజన్‌లో కేకేఆర్ దుమ్మురేపుతోంది. ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు.. 8 విజయాలు సాధించి, 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. నెట్ రన్‌రేట్ కూడా.. ఇతర జట్లతో ఎంతో మెరుగ్గా ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కేకేఆర్ గెలిస్తే.. అది అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. అదే జరిగితే.. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టు అదే అవుతుంది.

ఇదిలావుండగా.. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్, ముంబై జట్లు ఇప్పటిదాకా 33 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై ఏకంగా 23 మ్యాచ్‌ల్లో గెలిచి, పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. కానీ.. గత ఐదు మ్యాచ్‌ల్లో ఇరుజట్లు తలపడినప్పుడు మాత్రం, కేకేఆర్ ఆ ఐదింటిలోనూ పైచేయి సాధించింది. దీన్ని బట్టి.. కేకేఆర్ జట్టు ఎంత పటిష్టంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. మరి.. ఈ మ్యాచ్‌లో ఎవరు ఎవరిపై ఆధిపత్యం చెలాయిస్తారన్నది వేచిచూడాలి.

Updated Date - May 11 , 2024 | 09:15 PM

Advertising
Advertising