Nathan Lyon: ఆ భారత స్టారే నా గురువు.. అతడి వల్లే ఈ స్థాయిలో ఉన్నా: లియాన్
ABN, Publish Date - Nov 18 , 2024 | 08:09 PM
Nathan Lyon: ప్రస్తుత క్రికెటర్లలో టాప్ స్పిన్నర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు నాథన్ లియాన్. ఆస్ట్రేలియా జట్టు విజయాల్లో కీలకంగా మారిన ఈ ఆఫ్ స్పిన్నర్.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు.
IND vs AUS: ప్రస్తుత క్రికెటర్లలో టాప్ స్పిన్నర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు నాథన్ లియాన్. ఆస్ట్రేలియా జట్టు విజయాల్లో కీలకంగా మారాడీ ఆఫ్ స్పిన్నర్. దిగ్గజం షేన్ వార్న్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత ప్రభావం చూపించిన కంగారూ స్పిన్నర్‌గా లియాన్‌ను చెప్పొచ్చు. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని దాటి.. ఆరొందల క్లబ్‌లో చేరడమే టార్గెట్ గా దూసుకెళ్లున్నాడు లియాన్. వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలింగ్ చేసే లియాన్.. పూర్తిగా అగ్రెసివ్ అప్రోచ్‌తో ముందుకెళ్తాడు. చూసేందుకు సింపుల్‌గా కనిపించే ఈ స్పిన్నర్.. బౌలింగ్ మాత్రం అటాకింగ్ స్టైల్‌లో ఉంటుంది. మోడర్న్ క్రికెట్‌లో తోపు బౌలర్‌గా గుర్తింపు సంపాదించిన అతడు.. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఈ స్థాయిలో ఉండటానికి ఓ టీమిండియా క్రికెటరే కారణమన్నాడు.
గ్రౌండ్‌లోనే ప్రత్యర్థులం
ఒక భారత ఆటగాడే తన గురువు అని.. అతడు అన్నీ నేర్పించాడని లియాన్ తెలిపాడు. ఇంతకీ అతడు చెప్పిన ఆ క్రికెటర్ ఎవరనే కదా మీ సందేహం? అతడు మరెవరో కాదు.. దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ భారత బౌలర్ స్పిన్ టెక్నిక్స్‌ను చూసి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని లియాన్ వ్యాఖ్యానించాడు. గ్రౌండ్‌లో తాము ప్రత్యర్థులం కావొచ్చు గానీ బయటకు వస్తే మాత్రం మంచి ఫ్రెండ్స్ అన్నాడు. చాలా విషయాల మీద తాము డిస్కస్ చేసుకుంటామన్నాడు. అశ్విన్ అద్భుత బౌలర్ అంటూ ఆసీస్ స్టార్ ప్రశంసల్లో ముంచెత్తాడు.
గురుశిష్యుల్లో ఎవరు గెలుస్తారో..
‘అశ్విన్ ఎంత తోపు బౌలర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు ఏంటనేది రికార్డ్స్ చెబుతాయి. అతడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. సిచ్యువేషన్‌కు తగ్గట్లు అతడు తనను తాను మలచుకునే విధానం సూపర్బ్. నాకు గురువుగా ఎన్నో విషయాలు నేర్పాడు. అశ్విన్ బౌలింగ్ ఫుటేజీలను చూసి మరిన్ని విషయాలు నేర్చుకున్నా’ అని లియాన్ చెప్పుకొచ్చాడు. కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా త్వరలో తలపడనున్నాయి ఆసీస్-భారత్. కాబట్టి అశ్విన్-లియాన్ ఎలా ఆడతారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. వికెట్ల వేటలో గురుశిష్యుల్లో ఎవరు గెలుస్తారో చూడాలి.
Also Read:
ఈ స్టార్ క్రికెటర్‌ను గుర్తుపట్టారా.. బరిలోకి దిగితే బౌలర్లకు బడితపూజే
స్టొయినిస్ మెరుపు ఇన్నింగ్స్.. పాక్ బౌలర్లకు నరకం చూపించాడు
గంభీర్‌ను దింపేసేందుకు ఆసీస్ కుట్ర.. గట్టిగానే ప్లాన్ చేశారు
For More Sports And Telugu News
Updated Date - Nov 18 , 2024 | 08:13 PM