ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nitish Kumar Reddy: అది ‘బాహుబలి’ ఫోజు కాదు.. సీక్రెట్ రివీల్ చేసిన నితీష్

ABN, Publish Date - Dec 29 , 2024 | 02:44 PM

Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో సెంచరీతో కొత్త హీరోగా అవతరించాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. బ్లాస్టింగ్ నాక్‌తో అందరి మైండ్ బ్లాంక్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌తో పాటు ఆ తర్వాత చేసుకున్న సెలబ్రేషన్ బాగా వైరల్ అయింది.

Nitish Kumar Reddy

IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్‌లో సెంచరీతో కొత్త హీరోగా అవతరించాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. బ్లాస్టింగ్ నాక్‌తో అందరి మైండ్ బ్లాంక్ చేశాడు. ఓటమి కోరల్లో ఉన్న జట్టును బయటపడేశాడు. వాషింగ్టన్ సుందర్ సాయంతో టీమ్‌ను కాపాడాడు. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ లాంటి హేమాహేమీ బౌలర్లను తట్టుకొని అతడు క్రీజులో నిలబడిన తీరు.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించిన విధానం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. నితీష్ సెంచరీతో పాటు అతడి సెలబ్రేషన్ స్టైల్, స్వాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. హాఫ్ సెంచరీ తర్వాత ‘పుష్ప’ స్టైల్‌లో తగ్గేదేలే అంటూ బ్యాట్‌తో గడ్డాన్ని సవరించుకోవడం.. సెంచరీ అనంతరం ‘బాహుబలి’ మాదిరిగా బ్యాట్‌ను కత్తిలా నేల మీద పెట్టి మోకాలు మీద కూర్చోవడం హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై తాజాగా నితీష్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు.


అందుకే అలా ఫోజు ఇచ్చా..

సెంచరీ పూర్తవగానే బ్యాట్‌ను కింద పెట్టి దానికి హెల్మెట్ తగిలించాడు నితీష్. ఆకాశం వైపు చూస్తూ ఎవర్నో స్మరించుకున్నాడు. ఈ ఫోజు చూసిన నెటిజన్స్.. ‘బాహుబలి’, ‘సలార్’ మూవీస్‌లో ప్రభాస్‌ను తెలుగోడు రిపీట్ చేశాడని.. ఇది టాలీవుడ్ స్టైల్, స్వాగ్‌ అని అనుకున్నారు. అయితే ఇది ‘బాహుబలి’ ఫోజు కాదని నితీష్ క్లారిటీ ఇచ్చాడు. ‘హండ్రెడ్ మార్క్‌ను అందుకున్నాక బ్యాట్‌ను కింద పెట్టి దాని మీద హెల్మెట్ అమర్చాను. ఇలా చేయడానికి ఓ రీజన్ ఉంది. భారత జాతీయ జెండాకు గౌరవం ఇవ్వడంలో భాగంగానే ఇలా చేశా. జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తూ ఇలా సెలబ్రేట్ చేసుకున్నా’ అని నితీష్ రెడ్డి స్పష్టం చేశాడు.


సిరాజ్‌కు థ్యాంక్స్

దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప విషయం ఏదీ లేదని నితీష్ రెడ్డి అన్నాడు. టీమిండియాకు ఆడుతున్నాననే భావనే చాలా సంతృప్తి, సంతోషాన్ని ఇస్తోందని తెలిపాడు. తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తండ్రి ఏడ్చేశాడని.. ఆయన్ను చూశానన్నాడు. సెంచరీ మార్క్‌ను అందుకోవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతం గంభీర్ సహాయ సహాకారాలు ఉన్నాయని పేర్కొన్నాడు. డాట్ బాల్స్ ఆడుతూ తాను శతకం చేయడంలో హెల్ప్ చేసిన డీఎస్పీ సిరాజ్‌ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు నితీష్. తాను ప్రతిదీ చేయగలననే మెంటాలిటీతో సిరాజ్ ఉంటాడని ప్రశంసించాడు. అతడిలో అదే తనకు బాగా ఇష్టమని చెప్పుకొచ్చాడు.


Also Read:

బుమ్రా పగబడితే ఇట్లుంటది.. బెయిల్స్ వెతకడానికి టైమ్ సరిపోదు..

కపిల్ దేవ్ రికార్డ్ చిత్తు చేసిన బుమ్రా.. మరో ఘనత కూడా..

ప్రపంచ వేదికపై సత్తాచాటిన కోనేరు హంపి..

కొడుకు తొలి శతకం తండ్రి భావోద్వేగం అమ్మతో..

For More Sports And Telugu News

Updated Date - Dec 29 , 2024 | 02:49 PM