ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs AUS: ఆసీస్ బెండు తీసిన తెలుగోడు.. చేజారిన మ్యాచ్‌ను నిలబెట్టాడు

ABN, Publish Date - Nov 22 , 2024 | 04:47 PM

IND vs AUS: పెర్త్ టెస్ట్‌లో టీమిండియాకు ఎర్త్ పెట్టాలని అనుకుంది ఆస్ట్రేలియా. కానీ సీన్ రివర్స్ అయింది. తెలుగోడి పోరాటం ముందు కంగారూలు నిలబడలేకపోయారు.

Nitish Kumar Reddy: పెర్త్ టెస్ట్‌లో టీమిండియాకు ఎర్త్ పెట్టాలని అనుకుంది ఆస్ట్రేలియా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం తమ దేశానికి వచ్చిన బుమ్రా సేనకు మొదటి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాలని భావించింది. అందులో కొంతమేర సక్సెస్ కూడా అయింది. భారత బ్యాటర్లకు చుక్కలు చూపించింది. అయితే తెలుగోడి రాకతో అంతా మారిపోయింది. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పోరాటంతో కంగారూ టీమ్ బేజారైంది. పోయిందనుకున్న మ్యాచ్‌ను ఫైటింగ్ నాక్‌తో నిలబెట్టాడు నితీష్. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో కలసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని జోడించాడు.


కష్టసమయంలో క్రీజులోకి..

టీమిండియా పరువు కాపాడాడు నితీష్ రెడ్డి. అటాకింగ్ బ్యాటింగ్‌తో కంగారూల బెండు తీశాడు. 41 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అతడి పోరాటం గనుక లేకపోతే మ్యాచ్ ఈజీగా చేజారేది. కానీ అరంగేట్ర టెస్ట్‌లోనే ఫెంటాస్టిక్ నాక్ ఆడాడు నితీష్. మొత్తంగా 59 బంతుల్లో 6 బౌండరీలు, 1 సిక్స్‌తో 41 పరుగులు చేశాడు. పంత్‌తో కలసి ఎనిమిదో వికెట్‌కు 48 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. 73 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన తెలుగోడు.. ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో ఉన్నంత సేపు సాలిడ్ డిఫెన్స్‌తో పాటు చక్కటి షాట్లతో అతడు ఆకట్టుకున్నాడు.


పంత్ ఫిదా

ప్యాట్ కమిన్స్, జోష్ హేజల్‌వుడ్, నాథన్ లియాన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా నితీష్ అలవోకగా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా కమిన్స్ బౌలింగ్‌లో అతడు చెలరేగిపోయాడు. కమిన్స్ బౌలింగ్‌లో అద్భుతమైన రీతిలో అప్పర్ కట్‌తో ఆరు పరుగులు రాబట్టిన నితీష్.. లియాన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌తో నాలుగు పరుగులు రాబట్టాడు. ఈ ఫోర్, సిక్స్‌ చూసి అవతలి ఎండ్‌‌లో ఉన్న పంత్ కూడా ఫిదా అయిపోయాడు. తనలాగే అటాకింగ్ గేమ్ ఆడుతున్న నితీష్‌ను అతడు ఎంకరేజ్ చేశాడు. నితీష్-పంత్ పోరాటంతో భారత్ 150 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసేసరికి 7 వికెట్లకు 67 పరుగులు చేసింది. కెప్టెన్ బుమ్రా (4/17) ఆతిథ్య జట్టు నడ్డి విరిచాడు.


Also Read:

టీమిండియాను రెచ్చగొట్టిన లబుషేన్.. మళ్లీ నోరెత్తకుండా

వరల్డ్ కప్ హీరోను వణికించిన హర్షిత్ రాణా.. ఏం బౌలింగ్ భయ్యా

టైటాన్స్‌ హ్యాట్రిక్‌

For More Sports And Telugu News

Updated Date - Nov 22 , 2024 | 04:53 PM