T20 World Cup: కిషన్, శాంసన్ కాదు.. టీమిండియా వికెట్ కీపర్‌గా అతడే ఉండాలి
ABN, Publish Date - Jan 11 , 2024 | 11:35 AM
Sunil Gavaskar: టీ20 ప్రపంచకప్‌నకు మరో 6 నెలల సమయం కూడా లేదు. దీంతో జట్లన్నీ ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రపంచకప్‌నకు తమ జట్లను సిద్దం చేసుకోవడంపై సెలెక్టర్లు కూడా దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రపంచకప్‌నకు టీమిండియా ఎలాంటి జట్టుతో వెళ్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
టీ20 ప్రపంచకప్‌నకు మరో 6 నెలల సమయం కూడా లేదు. దీంతో జట్లన్నీ ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రపంచకప్‌నకు తమ జట్లను సిద్దం చేసుకోవడంపై సెలెక్టర్లు కూడా దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రపంచకప్‌నకు టీమిండియా ఎలాంటి జట్టుతో వెళ్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ముఖ్యంగా అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో టీమిండియాకు వికెట్ కీపర్‌గా ఎవరు ఉంటారనే అంశం చర్చనీయాంశంగా మారింది. రేసులో రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మ వంటి వాళ్లు ఉన్నప్పటికీ ప్రపంచకప్ జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో టీమిండియాకు వికెట్ కీపర్‌గా ఎవరూ ఉంటే బాగుంటుందనే అంశంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఓ క్రీడా ఛానెల్‌లో గవాస్కర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆశ్చర్యకరంగా యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌ను ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు వికెట్ కీపర్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌కు వైపు మొగ్గుచూపాడు. ఒకవేళ రిషబ్ పంత్ ఫిట్‌గా ఉంటే వికెట్ కీపర్‌గా తన మొదటి ప్రాధాన్యత అతనికేనని గవాస్కర్ చెప్పాడు.
గవాస్కర్ మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్‌నకు వికెట్ కీపర్‌గా నేను కేఎల్ రాహుల్‌ను ఎంచుకుంటాను. కానీ దాని కంటే ముందు ఒక విషయం చెబుతాను. రిషబ్ పంత్ ఒక కాలుతో ఫిట్‌గా ఉన్నా సరే జట్టులోకి రావాలి. టీ20 ప్రపంచకప్‌లో అతడే కీపర్‌గా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఫార్మాట్‌లో పంత్ గేమ్ ఛేంజర్. నేనే సెలెక్టర్ అయితే పంత్ పేరునే ముందుగా పరిగణనలోకి తీసుకుంటాను. ఒకవేళ రిషబ్ పంత్ అందుబాటులో లేకపోతే కేఎల్ రాహుల్‌ను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే రాహుల్ ఉంటే జట్టులో సమతూకం కూడా ఏర్పడుతుంది. రాహుల్ ఆల్ రౌండర్. రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడించవచ్చు. లేదా మిడిలార్డర్, ఫినిషర్‌గానూ ఉపయోగించుకోవచ్చు. రాహుల్ తన వికెట్ కీపింగ్ నైపుణ్యాన్ని బాగా మెరుగుపరచుకున్నాడు. అతను ఇంతకుముందు వికెట్ కీపింగ్ చేసినప్పుడు కొంచెం అయిష్టంగా కనిపించేవాడు. కానీ ఇప్పుడు అతనే సరైన వికెట్ కీపర్.’’ అని చెప్పాడు. కాగా అఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు కేఎల్ రాహుల్‌కు జట్టులో చోటు దక్కలేదు. కానీ ఇటీవల రాహుల్ అద్భుతంగా కీపింగ్ చేస్తున్నాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌తోపాటు సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లోనూ రాహుల్ టీమిండియాకు వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు. కానీ అఫ్ఘానిస్థాన్‌తో సిరీస్‌కు సెలెక్టర్లు రాహుల్‌ను ఎంపిక చేయలేదు. సంజూ శాంసన్, జితేష్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. దీంతో రాహుల్‌కు టీ20 ప్రపంచకప్‌లోనూ చోటు దక్కకపోవచ్చనే అభిప్రాయాలున్నాయి.
ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 11 , 2024 | 11:35 AM