PAK vs AUS: పాక్‌తో టీ20కి స్టార్ ఆటగాళ్లను పక్కనపెట్టిన ఆసీస్.

ABN, Publish Date - Oct 28 , 2024 | 12:33 PM

పాకిస్తాన్‌తో సొంతగడ్డపై టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ జట్టును ప్రకటించింది.కెప్టెన్ ఎంపిక సైతం ఇంకా పూర్తి కాలేదు.

PAK vs AUS: పాక్‌తో టీ20కి స్టార్ ఆటగాళ్లను పక్కనపెట్టిన ఆసీస్.
austrelia squad

సిడ్నీ: పాకిస్తాన్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా సోమవారం జట్టు ప్రకటన చేసింది. అయితే, ఈ సిరీస్ కు స్టార్ ఆటగాళ్లను ఆసిస్ జట్టు పూర్తిగా పక్కన పెట్టేసింది. కొత్త కెప్టెన్ ఎంపిక సైతం ఇంకా పూర్తి కాలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టెస్టు స్టార్లకు రెస్ట్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. దీంతో జట్టు కు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ సైతం పాక్ తో టీ20కి దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో మరో కెప్టెన్ ను ఎంపిక చేయనున్నారు.


13 మందితో కూడిన ఆసిస్ జట్టులో గాయాల కారణంగా కొంత కాలంగా దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్లు జేవియర్ బార్ట్ లెట్, నాథన్ ఇల్లిస్, స్పెన్సర్ జాన్సన్ కు ఈ సిరీస్‌లో చోటు కల్పించారు. ఇతర టెస్ట్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్‌లతో పాటు ఫాస్ట్ బౌలర్లు పాట్ కమిన్స్ , మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరం కానున్నాడు.


పాకిస్తాన్ తో ఆస్ట్రేలియా మూడు ట్వంటీ-20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు షెడ్యూల్:

బ్రిస్బేన్ (నవంబర్ 14),

సిడ్నీ (నవంబర్ 16),

హోబర్ట్ (నవంబర్ 18).

ఆస్ట్రేలియా టీ20 జట్టు:

సీన్ అబాట్ , జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ , టిమ్ డేవిడ్ , నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ , ఆరోన్ హార్డీ , జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్ , ఆడం జంపా.

ఆసిస్ టూర్‌కు పాక్ జట్టు:

అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మాద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమెర్ బిన్ యూసుఫ్, సాహిబాదా ఫరాన్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్

Team India: సౌతాఫ్రికాతో టీ20.. టీమిండియాకు కోత్త హెడ్ కోచ్


Updated Date - Oct 28 , 2024 | 12:47 PM