ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan: వరల్డ్ క్రికెట్‌కు షాక్.. పాకిస్థాన్‌పై బ్యాన్.. చేజేతులా చేసుకున్నారు

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:07 PM

Pakistan: పాకిస్థాన్ క్రికెట్‌కు సంబంధించి షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుత క్రికెట్‌లో క్రేజ్ ఉన్న జట్లలో ఒకటిగా ఉన్న పాక్‌ను బ్యాన్ చేయనున్నారని తెలుస్తోంది.

Champions Trophy 2025: పాకిస్థాన్ క్రికెట్‌కు సంబంధించి షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుత క్రికెట్‌లో క్రేజ్ ఉన్న జట్లలో ఒకటిగా ఉన్న పాక్‌ను బ్యాన్ చేయనున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు డేంజర్ టీమ్‌గా టాప్ సైడ్స్ అన్నింటినీ భయపెట్టింది దాయాది. బౌలింగ్ బలంతో తోపు ప్లేయర్లను కూడా వణికించింది. ఈ మధ్య కాలంలో అంతగా రాణించడం లేదు. అయినా ఆ టీమ్‌కు మంచి పాపులారిటీనే ఉంది. అలాంటి జట్టును బ్యాన్ చేయడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు వరల్డ్ క్రికెట్‌కు షాకింగ్‌గా మారిన ఈ బ్యాన్ విషయంపై క్లారిటీగా తెలుసుకుందాం..


అనవసరంగా ఇరుక్కున్నారు!

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో మొండికేస్తున్న పాక్‌ను బ్యాన్ చేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు (ఐసీసీ) డిసైడ్ అయిందని తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోవాల్సిందిగా కోరినా అందుకు పాక్ బోర్డు నో చెప్పడంతో ఐసీసీ పెద్దలు సీరియస్‌ అయ్యారట. దానికి తోడు తమ దేశంలో నిర్వహించాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీని సౌతాఫ్రికాకు తరలించే దిశగా ప్లానింగ్స్ నడుస్తుండటంతో ఆ టోర్నీలో ఆడొద్దని దాయాది దేశం భావిస్తోందట. ఇప్పటికే పాక్ మీద గుర్రుగా ఉన్న ఐసీసీ.. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో గనుక ఆ జట్టు ఆడకపోతే బ్యాన్ చేయాలని చూస్తోందట. దీంతో పాక్ చేజేతులా చేసుకుందని.. అనవసరంగా ఓవరాక్షన్ చేసి ఇరుక్కుపోయిందని అంటున్నారు.


యాక్షన్.. రియాక్షన్

భద్రతా కారణాల రీత్యా టీమిండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు భారత ప్రభుత్వం నో చెప్పింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని, తమ మ్యాచుల్ని యూఏఈకి షిఫ్ట్ చేయాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. అయితే పాక్ బోర్డు మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు. టీమిండియా తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబడుతోంది. ఒకవేళ తమ దేశానికి రాకపోయినా, హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచులు ఆడితే ఊరుకోబోమని హెచ్చరిస్తోంది. ఇక మీదట ఐసీసీ టోర్నీల్లో మెన్ ఇన్ బ్లూతో మ్యాచుల్లో ఆడబోమని, టీమిండియా మ్యాచుల్ని బహిష్కరిస్తామని వార్నింగ్ ఇస్తోంది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీని తరలిస్తే ఆ టోర్నీలో ఆడబోమని ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇస్తోంది. దీంతో ఆ టీమ్ ఆ దిశగా ఒక్క అడుగు వేసినా కొన్నాళ్ల పాటు బ్యాన్ విధించాలని ఐసీసీ భావిస్తోందట. ఈ వివాదం ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.


Also Read:

పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాయాది ఔట్

సౌతాఫ్రికాతో మూడో టీ20.. 2 మార్పులతో బరిలోకి భారత్

ఉమా మహేష్‌ బృందానికి స్వర్ణం

For More Sports And Telugu News

Updated Date - Nov 12 , 2024 | 12:10 PM