ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs SA: రోహిత్ vs జడేజా.. కేప్‌టౌన్ సాక్షిగా రన్నింగ్‌లో ఫస్ట్ ఎవరో తేలిపోయింది..

ABN, Publish Date - Jan 03 , 2024 | 06:37 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 36 ఏళ్ల వయసులోనూ కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా నడిపిస్తూ టీమిండియాకు విజయాలు అందిస్తున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దుమ్ములేపుతున్నాడు.

కేప్‌టౌన్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 36 ఏళ్ల వయసులోనూ కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా నడిపిస్తూ టీమిండియాకు విజయాలు అందిస్తున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దుమ్ములేపుతున్నాడు. ముఖ్యంగా జట్టు కోసం ఎలాంటి స్వార్థం లేని ఆట ఆడుతూ అందరి మన్ననలు పొందుతున్నాడు. అయితే హిట్‌మ్యాన్‌పై ఎన్ని ప్రశంసలు ఉన్నా ఓ వర్గం అతడిని ఎప్పుడూ విమర్శిస్తుంటుంది. ముఖ్యంగా రోహిత్ ఫిట్‌నెస్‌ను వేలెత్తి చూపిస్తుంటుంది. రోహిత్ బొద్దుగా ఉంటాడని, పొట్ట ఉందని.. దీంతో అతనికి సరైన ఫిట్‌నెస్ లేదని విమర్శిస్తుంటుంది. అలాంటి వారందరికీ రోహిత్ శర్మ తన ఆటతోనే సమాధానం ఇస్తూ వస్తున్నాడు. ఎప్పటికప్పుడు మైదానంలో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటూ విమర్శలకు గట్టి కౌంటర్ ఇస్తున్నాడు. తాజాగా మరోసారి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ సారి ఏకంగా టీమిండియాలో ఫాస్టెస్ట్ ఫీల్డరైనా రవీంద్ర జడేజాతో పోటీ పడి మరి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. పోటీ పడడమే కాదు జడేజాను ఓడించి సత్తా చాటాడు.


అసలు ఏం జరిగిందంటే.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో సిరాజ్ వేసిన 14వ ఓవర్ ఐదో బంతిని వెర్రెయిన్నే బౌండరీ లైన్ వైపు బాదాడు. ఆ బంతి కాస్త రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా మధ్య గుండా బౌండరీ లైన్ వైపు పరుగుపెట్టింది. దీంతో బంతిని ఆపేందుకు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఇద్దరూ పరుగుపెట్టారు. బౌండరీ లైన్ వరకు పరిగెత్తారు. కానీ జడేజా కంటే వేగంగా పరిగెత్తిన రోహిత్ శర్మ బంతిని బౌండరీ వెళ్లకుండా ఆపాడు. రోహిత్ వేగంగా పరిగెత్తి బంతిని ఆపుతుంటే రన్నింగ్ రేసులో వెనుకబడిన జడేజా చూస్తూ ఉండిపోయాడు. దీంతో భారత జట్టులో ఫాస్టెస్ట్ రన్నర్‌గా పేరున్న జడేజాను రన్నింగ్‌లో రోహిత్ ఓడించినట్టైంది. ఈ వీడియోను ఎక్స్‌లో అప్‌లోడ్ చేసిన అభిమానులు రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ను విమర్శించే వారికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు. రోహిత్ శర్మ ఆన్‌ఫిట్ కాదని చెబుతున్నారు. రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి మాట్లాడేవాళ్లు నోళ్లు మూసుకోవాలని రాసుకొస్తున్నారు. రోహిత్ శర్మ ఆన్‌ఫిట్ అన్నవాళ్లు కచ్చితంగా ఈ వీడియో చూడాలని చెబుతున్నారు. కాగా కొన్ని రోజుల క్రితం బీసీసీఐ స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ అంకిత్ కాలియార్ కూడా రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రోహిత్ శర్మ చూడడానికి కాస్త బొద్దుగా కనిపించినప్పటికీ విరాట్ కోహ్లీలాగే పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటాడని చెప్పాడు. ప్రతిసారి యోయో టెస్టులో ఉత్తీర్ణత సాధిస్తున్నట్టు తెలిపాడు.

Updated Date - Jan 03 , 2024 | 06:40 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising