Ashwin-Jadeja: అశ్విన్-జడేజా మూటాముల్లె సర్దుకోవాల్సిందే.. సీనియర్లకు డేంజర్ సిగ్నల్స్
ABN, Publish Date - Dec 03 , 2024 | 07:55 PM
Ashwin-Jadeja: భారత టెస్ట్ జట్టులో హవా నడిపిస్తున్నారు స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజా. బౌలింగ్‌తో పాటు అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేస్తూ టీమిండియా విజయాల్లో కీలకంగా మారారు అశ్విన్-జడ్డూ. కానీ వాళ్లకు డేంజర్ సిగ్నల్స్ వస్తున్నాయి.
IND vs AUS: భారత టెస్ట్ జట్టులో హవా నడిపిస్తున్నారు స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజా. బౌలింగ్‌తో పాటు అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేస్తూ టీమిండియా విజయాల్లో కీలకంగా మారారు అశ్విన్-జడ్డూ. వికెట్ల మీద వికెట్లు తీస్తూ.. బ్యాట్‌తోనూ మెరుస్తూ మ్యాచ్ విన్నర్లుగా కొనసాగుతున్నారు. లాంగ్ ఫార్మాట్‌లో భారత అజేయంగా ఉండటంలో వీళ్లకే కీలక పాత్ర. అలాంటి ఈ ఇద్దరు స్టార్లకు డేంజర్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఇద్దరూ మూటాముల్లె సర్దుకోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీళ్లను మళ్లీ గ్రౌండ్‌లో యాక్షన్‌లో చూడలేమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
సీనియర్లు అని చూడకుండా..
అశ్విన్-జడేజా కెరీర్ ఆఖరికి చేరుకుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు గనుక భారత్ చేరుకోకపోతే వీళ్ల కెరీర్ క్లోజ్ అనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీసీసీఐ, సెలెక్టర్లు, హెడ్ కోచ్ గౌతం గంభీర్ నుంచి ఇండికేషన్స్ వస్తున్నాయని.. అశ్విన్-జడ్డూ దాన్ని అర్థం చేసుకోవాలని అంటున్నారు. జాగ్రత్తగా గమనిస్తే.. భారత క్రికెట్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా ఊతం ఇస్తున్నాయి. పెర్త్ టెస్ట్‌లో ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లలో ఒక్కర్ని కూడా టీమ్‌లోకి తీసుకోలేదు. సీనియర్లు అనే గౌరవం కూడా ఇవ్వలేదు. ఆ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను ఆడించారు. ఇప్పుడు అడిలైడ్ టెస్ట్‌లోనూ అతడ్నే రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
రీప్లేస్‌మెంట్ రెడీ
ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సుందర్ బ్యాట్, బంతితో మెరిశాడు. దీనికి తోడు గత ఆసీస్ పర్యటనలో సుందర్ కంగారూ పిచ్‌లపై అదరగొట్టాడు. దీంతో అడిలైడ్ టెస్ట్‌లో అతడ్నే కంటిన్యూ చేసేలా కనిపిస్తున్నారు. దీంతో అశ్విన్-జడ్డూ బెంచ్‌కే పరిమితం అవ్వొచ్చు. అయితే ఈ సిరీస్‌కే కాదు.. తదుపరి సొంతగడ్డ మీద లేదా విదేశాల్లో ఆడే సిరీస్‌ల్లోనూ సుందర్‌నే ప్రధాన స్పిన్నర్‌గా దింపాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందని వినికిడి. అతడికి తోడుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌ను టీమ్‌లోకి తీసుకుంటారని సమాచారం. మునుపటి ఫామ్‌లో లేకపోవడం, న్యూజిలాండ్ సిరీస్‌లో ఫెయిల్ అవడం, వయసు కారణంగా అశ్విన్-జడ్డూను పక్కనబెట్టాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. వాళ్ల స్థానంలో సుందర్-అక్షర్ జోడీని స్పిన్ ఆల్‌రౌండర్స్‌గా పుష్ చేయాలని అనుకుంటోందట. దీంతో ఈ ద్వయం పనైపోయిందని.. రిటైర్మెంట్ ఇచ్చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే వీళ్ల విషయంలో బోర్డు ఏం చేస్తుందనేది చూడాలి.
Also Read:
టీమిండియాను భయపెడుతున్న కోహ్లీ.. ఆసీస్‌ను ఏడిపిస్తాడనుకుంటే..
ఇరకాటంలో బీసీసీఐ.. అంతా పాకిస్థాన్ వల్లే..
పాండ్యా బ్రదర్స్‌ను భయపెట్టిన సీఎస్‌కే బౌలర్.. ఐపీఎల్ రైవల్రీ షురూ
జైస్వాల్‌పై రోహిత్ సీరియస్.. ఎందుకిలా చేశావ్ అంటూ..
For More Sports And Telugu News
Updated Date - Dec 03 , 2024 | 07:55 PM