IND vs ENG: చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్.. డబ్ల్యూటీసీ చరిత్రలో..
ABN, Publish Date - Jan 25 , 2024 | 11:20 AM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు.
హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు. ఉప్పల్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు బెన్ డకెట్, జాక్ క్రాలేను ఔట్ చేయడం ద్వారా డబ్ల్యూటీసీ చరిత్రలో అశ్విన్ 150 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్ జోడి కూడా సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో టీమిండియాకు వీరిద్దరు కలిసి 500 వికెట్లను పూర్తి చేసుకున్నారు. దీంతో టీమిండియా తరఫున 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలింగ్ జోడిగా అశ్విన్, జడేజా చరిత్ర సృష్టించారు. అలాగే 501 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే- హర్బజన్ సింగ్ రికార్డును బద్దలుకొట్టారు. దీంతో ప్రస్తుతం 503 వికెట్లతో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలింగ్ జోడిగా అశ్విన్- జడేజా చరిత్ర సృష్టించారు. ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్టులో బెన్ డకెట్, ఓల్లీ పోప్, జాక్ క్రాలేను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ - జడేజా జోడి ఈ రికార్డు నెలకొల్పింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ శుభారంభాన్ని అందించారు. ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన వీరిద్దరు తొలి వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే స్పిన్నర్ల ఎంట్రీతో ఇంగ్లండ్ జట్టు 5 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు బెన్ డకెట్(35), జాక్ క్రాలే(20)ను అశ్విన్ ఔట్ చేయగా.. ఓల్లీ పోప్(1)ను జడేజా పెవిలియన్ చేర్చాడు. దీంతో 15.1 ఓవర్లలో 60 పరుగులు చేసిన ఇంగ్లండ్ టాప్ 3 వికెట్లు కోల్పోయింది.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 25 , 2024 | 02:17 PM