ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IND vs ENG: అనిల్ కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన రవీంద్ర జడేజా

ABN, Publish Date - Feb 19 , 2024 | 10:48 AM

ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన రోహిత్ సేన 434 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా బౌలర్లను ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే కుప్పకూల్చింది.

రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన రోహిత్ సేన 434 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా బౌలర్లను ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే కుప్పకూల్చింది. లోకల్ బౌలర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగాడు. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ (214) డబుల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ ఇన్నింగ్స్‌ను 430/4 వద్ద డిక్లేర్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 319 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(112) సెంచరీలతో చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతోపాటు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్‌లో భారత జట్టు 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.


ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న రవీంద్ర జడేజా టీమిండియా దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో ఇండియాలో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం జడేజా, కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నారు. వీరిద్దరు తొమ్మిదేసి సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు. దీంతో జడ్డూ భాయ్ కుంబ్లే సరసన చేరాడు. అయితే అనిల్ కుంబ్లే 63 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా.. జడేజా 42 టెస్టుల్లోనే సాధించాడు. ఎనిమిదేసి సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. కాగా విదేశాల్లో, స్వదేశంలో కలిపి టెస్టుల్లో జడేజా 10 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 14 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 19 , 2024 | 10:48 AM

Advertising
Advertising