ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ఈసారి టైటిల్ ఆ జట్టుదే.. జోస్యం చెప్పిన రికీ పాంటింగ్

ABN, Publish Date - Apr 17 , 2024 | 03:37 PM

ఐపీఎల్-2024 సీజన్ జోరుగా సాగుతున్న తరుణంలో.. ఈసారి ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందనే చర్చలు క్రీడా వర్గాల్లో సాగుతున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఇతర జట్లు కూడా దూకుడుగా రాణిస్తున్నాయి కాబట్టి.. ఏ జట్టు టైటిల్ సొంతం చేసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Ricky Ponting Claims Attacking Batting Going To Win This IPL ABK

ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్ జోరుగా సాగుతున్న తరుణంలో.. ఈసారి ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందనే చర్చలు క్రీడా వర్గాల్లో సాగుతున్నాయి. ముంబై ఇండియన్స్ (Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) పాటు ఇతర జట్లు కూడా దూకుడుగా రాణిస్తున్నాయి కాబట్టి.. ఏ జట్టు టైటిల్ సొంతం చేసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ముందుకు సాగే జట్టే టైటిల్‌ సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు.

దయచేసి ఆర్సీబీని అమ్మిపారేయండి.. టెన్నిస్ దిగ్గజం తీవ్ర అసహనం


‘‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఇప్పటికే రెండు సార్లు భారీ స్కోరు నమోదు చేసింది. కేకేఆర్‌ (KKR) కూడా ఢిల్లీపై 272 రన్స్‌ స్కోరు చేసింది. నాకు తెలిసి.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ కారణంగానే బ్యాటింగ్‌ జట్లకు ఈ మేరకు ప్రయోజనం చేకూరుతోందని అనిపిస్తోంది. నిజానికి.. ఐపీఎల్ వంటి టోర్నీల్లో లక్ష్యాన్ని కాపాడుకోగలిగిన జట్లే విజయం సాధించాయి. కానీ.. ఈసారి ఐపీఎల్ మాత్రం భిన్నంగా సాగుతోంది. బౌలర్లను చితక్కొడుతూ.. భారీ స్కోర్లు సాధించిన జట్లే టైటిల్‌ దిశగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. డిఫెన్సివ్‌ బౌలింగ్‌పై ఆధారపడే జట్ల కన్నా.. దూకుడుగా బ్యాటింగ్‌ చేసే జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి’’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్.. కారణం ఇదే?

పాంటింగ్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే.. సీజన్‌ ఆరంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తున్న సన్‌రైజర్స్‌ జట్టు ఈసారి టైటిల్‌ గెలిచే ఛాన్స్ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాట్ కమిన్స్‌ సారథ్యంలోని హైదరాబాద్‌ జట్టు.. మునుపెన్నడూ లేనంత గొప్ప ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఈ సీజన్‌లో రోజుల వ్యవధికలోనే రికార్డ్ స్కోర్లను నమోదు చేసింది. తొలుత ముంబై ఇండియన్స్‌పై 277 పరుగులు చేసిన హైదరాబాద్.. ఆ తర్వాత ఆర్సీబీపై 287 పరుగులు స్కోరు చేసింది. దీంతో.. ఐపీఎల్‌లో హయ్యస్ట్ స్కోరు చేసిన జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. అటు.. కేకేఆర్ సైతం ఢిల్లీ జట్టుపై 272 పరుగులతో సత్తా చాటింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 17 , 2024 | 03:40 PM

Advertising
Advertising