ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rishabh Pant: డీసీకి భారీ దెబ్బ.. రిషభ్ పంత్‌పై ఓ మ్యాచ్ నిషేధం.. కారణమిదే!

ABN, Publish Date - May 11 , 2024 | 05:52 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే అత్యంత కీలక మ్యాచ్‌కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం..

Rishabh Pant Banned From One Match

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bengaluru) జరగబోయే అత్యంత కీలక మ్యాచ్‌కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకి భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌పై (Rishabh Pant) ఒక మ్యాచ్ నిషేధం విధించడం జరిగింది. అతనికి రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా బ్యాన్ చేసినట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. ఇందుకు కారణం.. ఈ ఐపీఎల్ సీజన్‌లో అతని జట్టు మూడుసార్లు స్లో ఓవర్-రేట్ నమోదు చేయడమే.


యోగిని కూడా మోదీ వదిలిపెట్టరు.. మరో రెండు నెలల్లో..

ఇంతకుముందే డీసీ జట్టు రెండుసార్లు స్లో ఓవర్-రేట్‌ని మెయింటెయిన్ చేసినందుకు.. రిషభ్ పంత్‌కి జరిమానా విధించారు. ఏప్రిల్ 4న వైజాగ్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (Kolkata Knight Riders) జరిగిన మ్యాచ్‌లో రెండోసారి స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసినందుకు.. పంత్‌కు రూ.24 లక్షల ఫైన్ పడింది. అంతకుముందు.. వైజాగ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌తో (CSK) జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు.. అతనికి రూ.12 లక్షల జరిమానా పడింది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఢిల్లీ జట్టు నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోయింది. దీంతో.. ఐపీఎల్‌ నియమావళి ప్రకారం వ‌రుస‌గా మూడోసారి స్లో ఓవర్ రేట్‌ నమోదు చేసినందుకు పంత్‌పై 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా, మ్యాచ్ రిఫరీ విచక్షణ మేరకు ఒక మ్యాచ్ నిషేధం విధించారు.

కాంగ్రెస్ అణుబాంబు వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌కి ముందు డీసీకి రిషభ్ పంత్ దూరం కావడంతో.. నిజంగా ఆ జట్టుకి బారీ ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ జట్టు.. 6 విజయాలు సాధించి, 12 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ జట్టు ప్లేఆఫ్స్‌లో స్థానం పొందాలంటే.. తప్పకుండా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక్క మ్యాచ్ ఓడినా.. ఇంటికి తట్టాబుట్టా సర్దేయాల్సి ఉంటుంది. అందుకే.. ఆర్సీబీతో మ్యాచ్ ఆ జట్టుకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. అలాంటి మ్యాచ్‌కు రిషభ్ దూరం కావడం.. ఆ జట్టుకి పెద్ద లోటేనని చెప్పుకోవచ్చు.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 11 , 2024 | 05:52 PM

Advertising
Advertising