మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IND vs ENG: వైజాగ్‌లో టీమిండియా గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

ABN, Publish Date - Feb 01 , 2024 | 12:00 PM

భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడిన భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.

IND vs ENG: వైజాగ్‌లో టీమిండియా గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

వైజాగ్: భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా శుక్రవారం నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడిన భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ అధిక్యం లభించినప్పటికీ ఓటమిపాలవడం విమర్శలకు దారితీసింది. దీంతో వైజాగ్ టెస్టులో రోహిత్ సేన గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలోనే వైజాగ్‌లో జరిగిన గత టెస్టు మ్యాచ్‌ల రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.. ఇక్కడ గతంలో రెండు మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే వైజాగ్ పిచ్‌పై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు విజయం సాధించింది. వైజాగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఒకటి ఇంగ్లండ్‌తో, మరొకటి సౌతాఫ్రికాతో ఆడింది. ముఖ్యంగా వైజాగ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవచంద్రన్ అశ్విన్‌కు మంచి రికార్డులున్నాయి. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా 246 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వన్‌సైడేడ్‌గా సాగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను టీమిండియా చిత్తు చేసింది.


తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ(167), రెండో ఇన్నింగ్స్‌లో భారీ హాఫ్ సెంచరీ(81)తో చెలరేగిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అశ్విన్ 8 వికెట్లతో సత్తా చాటాడు. 2019లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో మ్యాచ్‌లో కూడా భారత జట్టు అదరగొట్టింది. 203 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో దుమ్ములేపాడు. మయాంక్ అగర్వాల్ డుబుల్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 7 వికెట్లు తీశాడు. హిట్‌మ్యాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వైజాగ్‌లో జరిగిన రెండు టెస్టుల్లోనూ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించింది. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 479గా ఉంది. అత్యధిక స్కోర్ 502గా ఉండగా అత్యల్ప స్కోర్ 158గా ఉంది. హైదరాబాద్‌లో మాదిరిగానే వైజాగ్ పిచ్ కూడా స్పిన్నర్లకు సహకరించనుంది. ఇక్కడ జరిగిన రెండు టెస్ట్‌ల్లో స్పిన్నర్లు 47 వికెట్లు తీయగా.. పేసర్లు 23 వికెట్లు తీశారు. వైజాగ్ టెస్టులో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌కు మంచి రికార్డులున్నాయి. రోహిత్ శర్మ ఇక్కడ రెండు సెంచరీలు సాధించగా.. అశ్విన్ రెండు టెస్టుల్లో 16 వికెట్లు పడగొట్టాడు. రోహిత్, అశ్విన్ గతంలో మాదిరిగా ఈ సారి కూడా చెలరేగితే వైజాగ్ టెస్టులో టీమిండియా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 01 , 2024 | 12:04 PM

Advertising
Advertising