ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: టాప్-3 రిటెయిన్‌ ప్లేయర్స్‌లో తన పేరు లేకపోవడంపై రోహిత్ శర్మ

ABN, Publish Date - Nov 01 , 2024 | 08:41 AM

ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టులో భారత జట్టు ఆటగాళ్లను కొనసాగించడాన్ని రోహిత్ శర్మ సమర్ధించాడు. ఇక తన పేరు టాప్-3 రిటెయిన్ జాబితాలో లేకపోవడంపై హిట్‌మ్యాన్ ఆసక్తికరంగా స్పందించాడు.

Rohit Sharma

టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ రిటెయిన్ చేసుకుంటుందా లేదా? మెగా వేలంలో అందుబాటులో ఉంటాడా? రోహిత్ శర్మ కోసం చాలా జట్లు సిద్ధంగా ఉన్నాయి!.. అంటూ గత కొన్ని వారాల్లో చాలా ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇవన్నీ ఉత్తదేనని ముంబై ఇండియన్స్ రిటెన్షన్ జాబితాతో తేలిపోయింది. 1.జస్ప్రీత్ బుమ్రా, 2.హార్దిక్ పాండ్యా, 3. సూర్యకుమార్ యాదవ్, 4.రోహిత్ శర్మ, 5. తిలక్ వర్మలను ముంబై ఫ్రాంచైజీ నిలుపుదల చేసుకుంది. ముంబై రిటెన్షన్‌పై కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించారు.


ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టులో భారత జట్టు ఆటగాళ్లను కొనసాగించడాన్ని రోహిత్ శర్మ సమర్ధించాడు. ఇక తన పేరు టాప్-3 రిటెయిన్ జాబితాలో లేకపోవడంపై హిట్‌మ్యాన్ ఆసక్తికరంగా స్పందించాడు. ‘‘ నేను టీ20 ఫార్మాట్ క్రికెట్ నుంచి నుంచి రిటైర్ కావడంతో రిటెన్షన్‌లో నాకు సరైన స్థానమే ఇచ్చారు. జాతీయ జట్టుకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. నేను కూడా అదే నమ్ముతాను. తాజాగా వేలంలో ఆటగాళ్లను దక్కించుకోవడం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే ఆటగాళ్లను ఆటగాళ్లను రిటెయిన్ చేసుకోవాలి’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.


‘‘ ముంబై ఇండియన్స్‌కు నేను చాలా క్రికెట్ ఆడాను. ఈ జట్టులో ఆడుతున్నందుకు సంతోషిస్తున్నాను. గత రెండు లేదా మూడు సీజన్లలో మేము అత్యుత్తమంగా ఆడలేదు. అయితే ఆ పరిస్థితిని మార్చేయాలని నిశ్చయంతో ఉన్నాం. ఐపీఎల్ 20225 కోసం మేము ఎదురుచూస్తున్నాం. ముంబై ఇండియన్స్‌కు ట్రోఫీలు గెలిచిన గొప్ప చరిత్ర ఉంది. నమ్మశక్యం కాని పరిస్థితుల నుంచి మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. నేను అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ కావడంతో నన్ను సరైన స్థానంలోనే రిటెయిన్ చేసుకున్నారని భావిస్తున్నాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.


క్రికెట్ కెరీర్‌లో తాను సాధించిన దాంట్లో ముంబై ఇండియన్స్‌ విజయాలు కూడా భాగమేనని హిట్‌మ్యాన్ చెప్పాడు. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లను తాను గుర్తుంచుకున్నానని చెప్పాడు. ఆ సంవత్సరాల్లో ఏం జరిగిందో అభిమానులందరికీ తెలుసునని, తాము తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. మునుపటి సీజన్ల కంటే మరింత బలంగా 2025లో పుంజుకుంటామని అన్నారు. ఇక మైదానంలో గెలుపోటములు ఉంటాయని వ్యా్ఖ్యానించాడు. కష్టపడి పనిచేయడం తనకు ఇష్టమని, బాగా సన్నద్దమవడానికి ఇష్టపడతనని చెప్పాడు.


రిటెయిన్‌పై హార్ధిక్ పాండ్యా ఏమన్నాడంటే..

ముంబై ఇండియన్స్ రిటెయిన్ లిస్ట్‌పై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా స్పందించాడు. ‘‘రిటెయిన్ చేసుకున్న ఐదుగురు ఆటగాళ్లూ ముంబై ఇండియన్స్‌తో మంచి జ్ఞాపకాలు కలిగి ఉన్నారు. మేము ఒక్కటిగా ఉన్నాం. మా ఐదు వేళ్లు కలిస్తే ఒక పిడికిలి అనే కోణంలో నేను చూస్తున్నాను’’ అని పాండ్యా వ్యాఖ్యానించాడు. సోదరభావం, స్నేహం, అదే సమయంలో ఏం జరిగినా ఒకరికొకరం మద్దతుగా ఉంటామని పేర్కొన్నాడు. కాగా ముంబై ఇండియన్స్ గత ఐపీఎల్ సీజన్‌లో చిట్ట చివరి స్థానంలో నిలిచింది.


ముంబై ఇండియన్స్ రిటెయిన్ ఆటగాళ్ల జాబితా ఇదే..

జస్ప్రీత్ బుమ్రా (రూ.18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు), హార్దిక్ (రూ.16.35 కోట్లు), రోహిత్ (రూ.16.30 కోట్లు), తిలక్ వర్మ (రూ. 8 కోట్లు)లను ముంబై ఇండియన్స్ రిటెయిన్ చేసుకుంది. ఈ ఐదుగురు ప్లేయర్లపై మొత్తం రూ.45 కోట్లు వెచ్చించింది.

Updated Date - Nov 01 , 2024 | 11:36 AM