Rohit Sharma: మరో మైలురాయిని చేరుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ
ABN, Publish Date - Feb 26 , 2024 | 09:50 PM
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. 192 పరుగుల లక్ష్య చేధనలో కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. 192 పరుగుల లక్ష్య చేధనలో కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఆ తర్వాత భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో శుభ్‌మన్ గిల్, ధృవ్ జురేల్ కలిసి విజయానికి కావాల్సిన 72 పరుగులు చేశారు. ఈ క్రమంలో గిల్ హాఫ్ సెంచరీ సాధించగా.. ధృవ్ జురేల్ 39 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులు చేయగా.. టీమిండియా 307 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 145 పరుగులు చేయగా.. భారత్ 192/5 స్కోర్ చేసి గెలిచింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో 55 పరుగులతో రాణించిన రోహిత్ శర్మ పలు మైలురాళ్లను చేరుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అలాగే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో 4 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 17వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా టెస్టుల్లో ఇంగ్లండ్‌పై 1,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కాగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు దూసుకుపోతోంది. తాజా టెస్ట్ సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఆ తర్వాత రోహిత్ సేన అద్భుతంగా పుంజుకుంది. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య చివరిదైన ఐదో టెస్ట్ మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభంకానుంది.
Updated Date - Feb 26 , 2024 | 09:50 PM