ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hardik Pandya: టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్.. కారణం ఇదే?

ABN, Publish Date - Apr 16 , 2024 | 05:36 PM

ఈమధ్య కాలంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనికి బ్యాడ్ టైం నడుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్‌గా రావడం.. క్రీడాభిమానులకి ఏమాత్రం రుచించడం లేదు.

ఈమధ్య కాలంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనికి బ్యాడ్ టైం నడుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్‌గా రావడం.. క్రీడాభిమానులకి ఏమాత్రం రుచించడం లేదు. దీనికితోడు.. పెర్ఫార్మెన్స్ సైతం అంతంత మాత్రంగానే ఉండటంతో అతనిపై అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. కెప్టెన్‌గా మైదానంలో సరైన ప్రణాళికలు రచించడంలోనూ, ఆటగాడిగా మెరుగైన ప్రదర్శన కనబర్చడంలోనూ.. అతడు విఫలం అవుతున్నాడు. దీంతో.. టీ20 వరల్డ్‌కప్‌లో పాండ్యాకు స్థానం ఉంటుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో వెలుగులోకి వచ్చిన ఓ వార్తని బట్టి చూస్తే.. హార్దిక్‌కి జట్టులో చోటు దక్కడం కష్టమేనని అనిపిస్తోంది.

ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరోసారి చుక్కెదురు.. అప్పటివరకు!


జూన్‌లో టీ20 వరల్డ్ ప్రారంభం కానుంది కాబట్టి.. భారత జట్టు ఎంపిక గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma), హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid), చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ (Ajit Agarkar) గత వారం సమావేశమయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యాకు జట్టులో స్థానం ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై ఆ ముగ్గురు దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించినట్లు వార్తలొస్తున్నాయి. అసలు పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉన్నాడా లేడా? ఆల్‌రౌండర్‌గా పూర్తి స్థాయిలో సేవలు అందించగలడా లేడా? అనే అంశంపై టీమిండియా మేనేజ్‌మెంట్‌ సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన అతడు.. కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. పరుగులు భారీగా సమర్పించుకోగా, మూడు వికెట్లే పడగొట్టాడు. నిజానికి.. సీమర్‌గా పాండ్యా జట్టుకి ఉపయోగపడతాయని అతడికి జట్టులో ప్రత్యేక స్థానం దక్కింది. కానీ.. ఆ విభాగంలోనే అతడు దారుణంగా విఫలమవుతున్నాడు.

దయచేసి ఆర్సీబీని అమ్మిపారేయండి.. టెన్నిస్ దిగ్గజం తీవ్ర అసహనం

ఈ సీజన్‌లో పాండ్యాలో కన్సిస్టెన్సీ, స్పష్టత అనేది లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే.. పాండ్యా ఎంపికపై ఇప్పుడే టీమిండియా మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇంకొన్నాళ్లు అతని ప్రదర్శన చూసిన తర్వాత.. జట్టులో స్థానం కల్పించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. కాబట్టి.. పాండ్యా ఇక నుంచైనా తన ఆటపై ఫోకస్ పెడితే బెటర్. లేకపోతే కెప్టెన్సీని చూసుకొని యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం.. టీ20 జట్టులో స్థానం దక్కడం దాదాపు కష్టమేనని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పాండ్యాని తీసుకోకపోతే.. అతని స్థానంలో సీఎస్‌కే స్టార్‌ శివం దూబే వైపు సెలక్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 05:41 PM

Advertising
Advertising