ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: మరో 7 పరుగుల దూరం.. ధోనీ రికార్డు బ్రేక్ చేసేందుకు చేరువైన రోహిత్ శర్మ

ABN, Publish Date - Aug 04 , 2024 | 03:07 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. ఇటీవలే అతడి నాయకత్వంలోని భారత్ టీ20 వరల్డ్ కప్-2024ను ముద్దాడింది. ఇక వ్యక్తిగతంగా ఫామ్ దృష్ట్యా కూడా హిట్‌మ్యాన్ అద్భుతంగా రాణిస్తున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. ఇటీవలే అతడి నాయకత్వంలోని భారత్ జట్టు టీ20 వరల్డ్ కప్-2024ను ముద్దాడింది. ఇక వ్యక్తిగతంగా ఫామ్ దృష్ట్యా కూడా హిట్‌మ్యాన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్‌ చేరువయ్యాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో 58 పరుగులు సాధించిన కెప్టెన్.. మరో 7 పరుగులు సాధిస్తే భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానానికి చేరుకుంటాడు.


ప్రస్తుతం 10,767 పరుగులతో 6వ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ మరో ఏడు పరుగులు సాధిస్తే.. 10,773 పరుగులతో 5వ స్థానంలో ఉన్న ఎంఎస్ ధోనీని వెనక్కి నెడతాడు. ఇక అంతర్జాతీయంగా చూస్తే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు జాబితాలో 11వ స్థానంలో నిలవనున్నాడు. కాగా ఇవాళ (ఆదివారం) భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండవ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


శ్రీలంకతో రెండో వన్డేలోనే రోహిత్ శర్మ ఈ రికార్డును సాధిస్తే.. ధోనీ కంటే 40 మ్యాచ్‌లు ముందుగానే ఈ రికార్డును అందుకున్నట్టు అవుతుంది. ధోనీ కెప్టెన్సీలో క్రికెట్ కెరీర్ మొదలుపెట్టిన హిట్‌మ్యాన్ ఇప్పుడు అతడి రికార్డుపైనే కన్నేయడం ఆసక్తికర విషయం. వన్డేలలో గొప్ప ఓపెనర్‌లలో ఒకడిగా నిలిచిపోయేలా ఆడుతున్న విషయం తెలిసిందే.


వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్లు..

1. సచిన్ టెండూల్కర్ - 18,426 (452 మ్యాచ్‌లు)

2. విరాట్ కోహ్లీ - 13,872 (281 మ్యాచ్‌లు)

3. సౌరవ్ గంగూలీ - 11,363 (300 మ్యాచ్‌లు)

4. రాహుల్ ద్రవిడ్ -10,889 (318 మ్యాచ్‌లు)

5. ఎంఎస్ ధోనీ - 10,773 (297 మ్యాచ్‌లు)

6. రోహిత్ శర్మ - 10,767 (255 మ్యాచ్‌లు)


దూకుడు గేర్ మార్చిన హిట్‌మ్యాన్..

కెప్టెన్ రోహిత్ శర్మ 2023 నుంచి గేర్ మార్చి ఆడుతున్నాడు. బౌలర్లపై ఆరంభం నుంచే విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా వన్డే ప్రపంచ కప్ సమయంలో ఈ దూకుడైన ఆటతీరు ఎక్కువగా కనిపించింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లోనూ అదే దూకుడుని ప్రదర్శించాడు. తాజాగా శ్రీలంకతో సిరీస్‌లోనూ మొదటి వన్డేలో ఇదే ఆటతీరు కనబరిచాడు.

Updated Date - Aug 04 , 2024 | 03:11 PM

Advertising
Advertising
<