ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rohit Sharma: ఆ ఒక్క ఆడియో నా కొంపముంచింది.. అతడ్ని వేడుకున్న రోహిత్ శర్మ

ABN, Publish Date - May 18 , 2024 | 12:34 PM

ఇటీవల రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అందులో కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో మాట్లాడుతూ కనిపించిన రోహిత్..

ఇటీవల రోహిత్ శర్మకు (Rohit Sharma) సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అందులో కేకేఆర్ (Kolkata Knight Riders) అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో (Abhishek Nair) మాట్లాడుతూ కనిపించిన రోహిత్.. అంతా ఒక్కొక్కటిగా మారుతోందని అన్నాడు. అంతేకాదు.. ఇదే తన చివరి ఐపీఎల్ (IPL) అని చెప్పాడని కూడా ప్రచారం జరిగింది. ఇక అప్పటి నుంచి కెమెరా ముందు ఏం మాట్లాడాలన్నా.. రోహిత్ ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడు. అసలు కెమెరా ముందు మాట్లాడాలంటేనే జంకుతున్నాడు. ఇందుకు ఉదాహరణగా.. తాజాగా ఓ పన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.


రోహిత్ ఫన్నీ వీడియో

ముంబైలోని వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ జరగడానికి ముందు.. ధవాల్ కులకర్ణితో పాటు మరో ఇద్దరితో సరదాగా మాట్లాడుతూ కనిపించాడు. ఆ నలుగురి మధ్య సంభాషణ సరదాగా అనిపించడంతో.. కెమెరామ్యాన్ ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించాడు. ఇది గమనించిన రోహిత్.. వెంటనే చేతులెత్తి జోడించి, నీ కెమెరా ఆడియోని మ్యూయ్ చేయమంటూ ఫన్నీగా కోరాడు. ‘‘బ్రదరూ.. ముందు ఆడియో బంద్ చెయ్ నాయనా! ఇప్పటికే వైరల్ అయిన ఓ ఆడియో నా కొంపకొల్లేరు చేసింది’’ అని నమస్కరిస్తూ కెమెరామ్యాన్‌ని వేడుకున్నాడు. దీంతో.. చుట్టుపక్కన ఉన్న వాళ్లందరూ ఫక్కున నవ్వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


రోహిత్-అభిషేక్ వీడియో

గతంలో రోహిత్, అభిషేక్ మధ్య జరిగిన సంభాషణ వీడియో కాస్త వివాదాస్పదం అవ్వడంతో.. కేకేఆర్ యాజమాన్యం దానిని ఎక్స్ నుంచి తొలగించింది. అయితే.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు ఆ వీడియోలో రోహిత్ ఇదే తన చివరి ఐపీఎల్ అని చెప్పలేదు. అసలు వారి మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే.. ‘‘ఓ విషయమైతే మారుతోంది. అది వారి చేతుల్లోనే ఉంది. ఏదేమైనా, అది నా ఇల్లు. ఆ టెంపుల్‌ని కట్టించింది నేనే’’. దీన్ని బట్టి చూస్తే.. వాళ్లిద్దరు ఏదో తమ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటున్నారని స్పష్టమవుతోంది. అంతే తప్ప.. ఇదే తన చివరి ఐపీఎల్ అని రోహిత్ ఎక్కడా చెప్పలేదు. అదంతా అబద్ధపు ప్రచారం మాత్రమే!

Updated Date - May 18 , 2024 | 12:34 PM

Advertising
Advertising