RCB vs GT: విల్ జాక్స్, కోహ్లీల ఊచకోత.. గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం
ABN, Publish Date - Apr 28 , 2024 | 07:07 PM
గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ నష్టానికి 16 ఓవర్లలోనే (206 పరుగులు) ఛేధించింది. సెంచరీతో విల్ జాక్స్ (41 బంతుల్లో 100) శివాలెత్తడంతో...
గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో (Gujarat Titans) జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) ఘనవిజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ నష్టానికి 16 ఓవర్లలోనే (206 పరుగులు) ఛేధించింది. సెంచరీతో విల్ జాక్స్ (Will Jacks) (41 బంతుల్లో 100) శివాలెత్తడంతో పాటు విరాట్ కోహ్లీ (Virat Kohli) (44 బంతుల్లో 77) అద్భుతంగా రాణించడంతో.. ఆర్సీబీ ఈ సంచలన విజయాన్ని నమోదు చేయగలిగింది..
తన సూపర్ ఫామ్ వెనుక అసలు రహస్యం రివీల్ చేసిన ధోనీ
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (84), షారుఖ్ ఖాన్ (58) అర్థశతకాలతో అదరగొట్టడం వల్ల.. ఆర్సీబీ ముందు 201 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేధనలో భాగంగా.. ఆర్సీబీ ఒక వికెట్ కోల్పోయి 16 ఓవర్లలో 206 పరుగులు చేసి గెలుపొందింది. మొదట్లో ఆర్సీబీ తన ఇన్నింగ్స్‌ని నిదానంగా మొదలుపెట్టినా.. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. కెప్టెన్ ఫాప్ డు ప్లెసిస్ (24) ఔట్ అయ్యాక.. కోహ్లీ, విల్ జాక్స్ కలిసి తమ జట్టుని విజయతీరాలకు పంపించారు.
మొదట విల్ జాక్స్ క్రీజులో కుదురుకోవడానికి చాలానే సమయం తీసుకున్నాడు. అతడు భారీ షాట్లు కొట్టే ప్రయత్నం చేసినా, అతని బ్యాట్‌కి బంతులు అందలేదు. అప్పుడు విరాట్ కోహ్లీ ధ్వజమెత్తాడు. ఆచితూచి ఆడుతూనే.. భారీ షాట్లతో చెలరేగాడు. ఇక విల్ జాక్స్ క్రీజులో నిలదొక్కుకున్నాక.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోహ్లీకి బ్యాటింగ్ చేసే ఆప్షన్ ఇవ్వకుండా.. బౌండరీల సునామీ సృష్టించాడు. మోహసిన్, రషీద్ ఖాన్ లాంటి డేంజరస్ బౌలర్లను సైతం ముచ్చెమటలు పట్టించి.. తన శతకం పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
రిషభ్ పంత్‌కి భారీ ఎదురుదెబ్బ.. ఒక మ్యాచ్ నిషేధం.. ఎందుకంటే?
నిజానికి.. విరాట్ కోహ్లీ దూకుడు చూసి అతడు ఈ మ్యాచ్‌లో సెంచరీ కొట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ.. విల్ జాక్స్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తాను ఊచకోత కోయడం మొదలుపెట్టాక, తానొక్కడే రప్ఫాడిస్తూ వచ్చాడు. ఎడాపెడా షాట్లతో విధ్వంసం సృష్టించాడు. కోహ్లీని మరో ఎండ్‌లో నిల్చోబెట్టి.. తాను బౌండరీల వర్షం కురిపించి, సునాయాసంగా సెంచరీ చేసుకున్నాడు. విల్ జాక్స్ ఇలా విరుచుకుపడటం వల్లే.. మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే ఆర్సీబీ విజయఢంకా మోగించింది.
Read Latest Sports News and Telugu News
Updated Date - Apr 28 , 2024 | 07:11 PM