ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RR vs LSG: వాట్ ఏ క్యాచ్ రాహుల్.. గాయం తర్వాత కూడా సూపర్ కీపింగ్

ABN, Publish Date - Mar 24 , 2024 | 04:53 PM

ఐపీఎల్ 2024లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుత కీపింగ్ ఆకట్టుకుంటుంది. గాయం తర్వాత కోలుకుని జట్టులోకి వచ్చిన వెంటనే రాహుల్ అద్భుత కీపింగ్ నైపుణ్యం ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

జైపూర్: ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా లక్నోసూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals vs Lucknow Super Giants) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుత కీపింగ్ ఆకట్టుకుంటుంది. గాయం తర్వాత కోలుకుని జట్టులోకి వచ్చిన వెంటనే రాహుల్ అద్భుత కీపింగ్ నైపుణ్యం ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాహుల్ అద్భుత కీపింగ్‌తోపాటు రాజస్థాన్ రాయల్స్ కీలక బ్యాటర్ జోస్ బట్లర్ 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ చివరి బంతిని నవీన్ ఉల్ హక్ ఫుల్లర్ లెంగ్త్ డెలివరీ వేశాడు. ఆ బంతి బట్లర్ బ్యాటుకు ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ల వెనుకకు వెళ్లింది. కీపర్‌కు అందకుండా కాస్త దూరంగా పడబోయింది. దానిని గమనించిన రాహుల్ కుడి వైపునకు డైవ్ చేసి లో క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు. క్యాచ్ అందుకున్నాక కింద పడినప్పటికీ బంతి చేతుల్లో నుంచి జారిపోకుండా గ్లోవ్స్‌తో గట్టిగా పట్టుకున్నాడు. దీంతో బట్లర్ ఔటయ్యాడు. 13 పరుగులకే రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది.


ఈ అద్భుత క్యాచ్‌తో రాహుల్ ఫిట్‌నెస్‌పై ఉన్న అనుమానాలు కూడా తొలగిపోయాయి. ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్ అనంతరం గాయపడిన రాహుల్ ఆ తర్వాత సిరీస్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఆరంభ మ్యాచ్‌ల్లో ఆడకపోవచ్చనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఫిట్‌నెస్ సాధించిన రాహుల్ బరిలోకి దిగాడు. అయితే వికెట్ కీపింగ్ చేయకపోవచ్చనే వార్తలు వచ్చాయి. కానీ రాహుల్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. కాగా ఐపీఎల్‌లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా రాహుల్ సత్తా చాటితే జూన్‌లో జరిగే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నేను తిరిగి మైదానంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నాను. గత రెండు సంవత్సరాలుగా గాయం నా బెస్ట్ ఫ్రెండ్‌గా మారింది.’’ అని చెప్పాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే 13 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 119/2 స్కోర్ చేసింది. క్రీజులో సంజూ శాంసన్(51), రియాన్ పరాగ్ (31) ఉన్నారు. అంతకుముందు 49 పరుగులకే రాజస్థాన్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: గుడ్ న్యూస్.. ఐపీఎల్ రెండో విడత కూడా ఇండియాలోనే? సాక్ష్యం ఇదిగో!

IPL 2024: సన్‌రైజర్స్ vs నైట్ రైడర్స్ మ్యాచ్‌లో మైండ్ బ్లోయింగ్ టీ20 రికార్డు నమోదు



Updated Date - Mar 24 , 2024 | 04:57 PM

Advertising
Advertising