ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs SA: తొలి రోజే నేలకూలిన 23 వికెట్లు.. సచిన్ ఆసక్తికర కామెంట్స్

ABN, Publish Date - Jan 04 , 2024 | 10:55 AM

భారత్, సౌతాఫ్రికా మధ్య మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఏకంగా 23 వికెట్లు వికెట్లు నేలకూలాయి. పిచ్‌‌పై బౌన్స్ లభించడంతో పండుగ చేసుకున్న రెండు జట్ల పేసర్లు బఠాణీలు తిన్నంత సులువుగా వికెట్లు పడగొట్టారు. ఒకానొక దశలో పరుగుల కంటే ఎక్కువగా వికెట్లే వచ్చాయి.

కేప్‌టౌన్: భారత్, సౌతాఫ్రికా మధ్య మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఏకంగా 23 వికెట్లు వికెట్లు నేలకూలాయి. పిచ్‌‌పై బౌన్స్ లభించడంతో పండుగ చేసుకున్న రెండు జట్ల పేసర్లు బఠాణీలు తిన్నంత సులువుగా వికెట్లు పడగొట్టారు. ఒకానొక దశలో పరుగుల కంటే ఎక్కువగా వికెట్లే వచ్చాయి. రెండు జట్ల తమ మొదటి ఇన్నింగ్స్‌లో తొలి రోజే ఆలౌట్ అయ్యాయి. అంతేకాకుండా తొలి రోజు ఆటలోనే రెండో ఇన్నింగ్స్ కూడా ప్రారంభమైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అతిథ్య జట్టు సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఆ జట్టు భారత్ కన్నా ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 55 పరుగులు మాత్రమే చేయగా.. భారత జట్టు 153 పరుగులు చేసింది. తొలి రోజే సంచలనాల మీద సంచలనాలు నమోదుకావడంతో ఈ టెస్టు మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్శించింది. పిచ్ రెండో రోజు కూడా ఇదే విధంగా ఉంటే టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం ఖాయం.


తొలి రోజు ఆటలో నమోదైన సంచలనంపై భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ఎక్స్ వేదికగా సచిన్ కామెంట్ చేశారు. తాను ఫ్లైట్ ఎక్కే సమయానికి సౌతాఫ్రికా ఆలౌట్ అయిందని, కానీ తాను ఇంటికి వచ్చి టీవీ చూసే సరికి సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ చేస్తోందని చెప్పారు. ఇది తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని, అసలు ఈ గ్యాప్‌లో ఏం జరిగింది? అంటూ సచిన్ కామెంట్ చేశారు. ‘‘ఒకే రోజు 23 వికెట్లతో 2024 సంవత్సరం ప్రారంభమైంది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. సౌతాఫ్రికా జట్టు ఆలౌట్ అయినప్పుడు నేను ఫ్లైట్ ఎక్కాను. నేను ఇంటికి వచ్చి టీవీలో చూస్తే సౌతాఫ్రికా జట్టు 3 వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ చేస్తోంది. ఈ గ్యాప్‌లోనే నేను ఏమి కోల్పోయాను?’’ అంటూ సచిన్ ట్వీట్ చేశారు. అయితే ఒక్క సచినే కాదు చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. మ్యాచ్ ఇలా ప్రారంభమైందో లేదో అప్పుడే సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. టీమిండియా కూడా ఎక్కువ సేపు ఆడలేదు. ఇంతలోనే రెండో ఇన్నింగ్స్ కూడా ప్రారంభమైంది. ఏది ఏమైనా భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటను చూసిన వారంతా కాస్త షాక్‌లోనే ఉన్నారు.

Updated Date - Jan 04 , 2024 | 10:57 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising