ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T20 Cricket: టీ20 క్రికెట్‌లో వరల్డ్ రికార్డ్.. కేవలం 27 బంతుల్లోనే సెంచరీ

ABN, Publish Date - Jun 18 , 2024 | 03:59 PM

టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్లు ఎలా చెలరేగి ఆడుతారో అందరికీ తెలుసు. అవతల బౌలర్లు ఎలాంటి వారైనా సరే.. పిచ్ సహకరిస్తే మాత్రం బ్యాటర్లు ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టిస్తారు.

Sahil Chauhan Breaks World Record For Fastest T20I Century

టీ20 ఫార్మాట్‌లో (T20 Cricket) బ్యాటర్లు ఎలా చెలరేగి ఆడుతారో అందరికీ తెలుసు. అవతల బౌలర్లు ఎలాంటి వారైనా సరే.. పిచ్ సహకరిస్తే మాత్రం బ్యాటర్లు ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టిస్తారు. ఫోర్లు, సిక్సులతో మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఆటగాళ్లు అరుదైన ఘనతలు సాధించారు. ఇప్పుడు తాజాగా బారత మూలాలు కలిగిన సాహిల్ చౌహాన్ (Sahil Chauhan) అనే బ్యాటర్ ఎవ్వరికీ సాధ్యం కాని ఓ రికార్డ్‌ని నెలకొల్పాడు. కేవలం 27 బంతుల్లోనే శతకం చేసి.. టీ20 ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.

Read Also: 48 గంటల్లో మరణమే.. జపాన్‌లో వ్యాపిస్తున్న అరుదైన వ్యాధి

ఇంతకుముందు అంతర్జాతీయ టీ20ల్లో ఈ రికార్డ్ నమీబియా ప్లేయర్ జాన్-నికోల్ లాఫ్టీ ఈటన్ పేరిట ఉండేది. అతడు 33 బంతుల్లో శతకం చేశాడు. ఇప్పుడు సాహిల్ 27 బంతుల్లోనే సెంచరీ చేసి.. ఆ రికార్డ్‌ను పటాపంచలు చేశాడు. ఓవరాల్ టీ20 ఫార్మాట్‌లో చూసుకుంటే.. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (Chris Gayle) ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున 30 బంతుల్లోనే శతకం బాదాడు. 2013 ఏప్రిల్ 13న పూణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఊచకోత కోశాడు. తాజాగా సాహిల్ దెబ్బకు ఈ రికార్డ్ కూడా తుడుచుకుపెట్టుకుపోయింది. ఎస్తోనియా జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్న సాహిల్.. ఇటీవల సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

Read Also: మారిన కెనడా ప్రధాని స్వరం.. ఇకపై భారత్‌తో కలిసి..


తొలుత బ్యాటింగ్ చేసిన సైప్రస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం ఎస్తోనియా జట్టు బ్యాటింగ్‌కు దిగగా.. సాహిల్ చౌహాన్ (44 బంతుల్లో 144*) దూకుడుగా ఆడాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే ఎడాపెడా షాట్లతో దుమ్ముదులిపేశాడు. దీంతో.. 13 ఓవర్లలోనే ఆ భారీ లక్ష్యాన్ని ఎస్తోనియా జట్టు పూర్తి చేసింది. తన ఇన్నింగ్స్‌లో సాహిల్ ఆరు ఫోర్లతో పాటు 18 సిక్సులు బాదాడు. దీంతో.. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గానూ అతను చరిత్రపుటలకెక్కాడు. ఈ మ్యాచ్‌లో సాహిల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డ్‌ని సొంతం చేసుకున్నాడు.

Read Also: జో బైడెన్ వింత ప్రవర్తన.. స్టేజ్‌పై బిగుసుకుపోయి..

మరో విషయం ఏమిటంటే.. సాహిల్ ఇప్పటివరకూ కేవలం నాలుగు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో పెద్దగా సత్తా చాటలేకపోయిన అతను, నాలుగో మ్యాచ్‌లో మాత్రం తన బ్యాట్‌కు పని చెప్పాడు. కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి అన్నట్టు.. పరుగుల సునామీ సృష్టించాడు. ఫలితంగా.. 27 బంతుల్లోనే శతకం చేసి, టీ20 ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.

Read Latest Cricket News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 03:59 PM

Advertising
Advertising