Sanju Samson: ఆ ముగ్గురే నా కొడుకు కెరీర్‌ను 10 ఏళ్లు నాశనం చేశారు: సంజూ తండ్రి ఫైర్
ABN, Publish Date - Nov 13 , 2024 | 07:23 PM
టీ20 ప్రపంచ కప్ 2024లో కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత, సంజూ శాంసన్‌కు దారులు తెరుచుకున్నాయి. గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మద్దతుతో అతడిని ఓపెనింగ్‌లో ప్రయత్నించారు.
ముంబై: రికార్డు బ్రేకింగ్ ప్రదర్శనలిస్తూ క్రికెట్ అభిమానుల్లో సంజూ శాంసన్ సరికొత్త ఆశలు రేపుతున్నాడు. ఇప్పటికే టీ20 జట్టులో తన స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. ఓ వైపు సంజుపై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. మరోవైపు తండ్రి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భారత్‌లోని ముగ్గురు దిగ్గజ కెప్టెన్లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. 2015లో టీ20లో అరంగేట్రం చేసిన సంజూ అద్భుత ప్రదర్శన చేసినా జట్టులో చోటు దక్కలేదు. అయితే ఇన్నేళ్లకు సూర్య కుమార్ కెప్టెన్సీతో వారి నిరీక్షణ ముగిసింది.
టీ20 ప్రపంచ కప్ 2024లో కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత, సంజూ శాంసన్‌కు దారులు తెరుచుకున్నాయి. గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మద్దతుతో అతడిని ఓపెనింగ్‌లో ప్రయత్నించారు. కొన్ని మ్యాచ్‌లలో, శాంసన్ పరుగులు సాధించలేదు, కానీ ఆ తర్వాత అతను తన అద్భుతమైన ఫామ్‌ను చూపించాడు. టీ20లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి భారతీయుడిగా శాంసన్ నిరూపించుకున్నాడు. మొదటి టీ20లో అతను కేవలం 50 బంతుల్లో 107 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, ఇందులో 10 సిక్సర్లు ఉన్నాయి. తాజాగా శాంసన్ గురించి అతని తండ్రి మాట్లాడుతూ.. ధోనీ, విరాట్, రోహిత్‌లను టార్గెట్ చేశాడు.
వారి వల్లే కెరీర్ నాశనం..
సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ ఓ మలయాళ ఛానెల్‌తో మాట్లాడుతూ.. 'ముగ్గురు నలుగురు కలిసి నా కొడుకు కెరీర్‌ని 10 ఏళ్లపాటు నాశనం చేశారు. ధోనీ, కోహ్లి, రోహిత్, రాహుల్ ద్రవిడ్ వంటి కోచ్‌ల కారణంగా అతని కెరీర్‌లో 10 ఏళ్లు వేస్ట్ అయ్యాయి. వారు అతన్ని ఎంత తొక్కిపెడితే అతను అంతే వేగంగా తిరిగి వచ్చాడు అంటూ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు.
వారిద్దరికీ చాలా థ్యాంక్స్..
సంజు తండ్రి మాట్లాడుతూ.. ‘నా కొడుకు సెంచరీ చేసిన ఘనత ఇద్దరికే దక్కుతుంది. అందులో గౌతం గంభీర్, సూర్యకుమార్ ఉంటారు. సౌత్‌ఆఫ్రికా వంటి దిగ్గజ జట్టుపై సంజూ సెంచరీని అంతా ప్రశంసిస్తున్నారు. అది ఎంత పెద్ద జట్టో నాకు తెలియదు. సెంచరీ అంటే సెంచరీనే. ఈ విజయంలో వారిద్దరికీ నేను థాంక్స్ చెప్పదలుచుకన్నాను’ అంటూ తెలిపారు.
Mahendra Singh Dhoni: ఆ కేసులో ధోనీకి హైకోర్టు నోటీసులు.. అసలేం జరిగిందంటే..
Updated Date - Nov 14 , 2024 | 11:04 AM