ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sara Tendulkar: సారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందా.. ఆ వీడియో వెనుక ఆంతర్యం ఏమిటి?

ABN, Publish Date - Jul 17 , 2024 | 06:53 PM

సినీ పరిశ్రమకు, క్రీడా రంగానికి (ముఖ్యంగా క్రికెటర్లకు) ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. ఇరు రంగాలకు చెందిన వారు ఎంతో సాన్నిహిత్యంగా మెలుగుతుంటారు. కొందరు క్రీడాకారులు..

Sara Tendulkar

సినీ పరిశ్రమకు, క్రీడా రంగానికి (ముఖ్యంగా క్రికెటర్లకు) ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. ఇరు రంగాలకు చెందిన వారు ఎంతో సాన్నిహిత్యంగా మెలుగుతుంటారు. కొందరు క్రీడాకారులు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. వాళ్లు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. ఏదేమైనా.. క్రీడాకారులు సినిమా రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఓ క్రికెటర్ ఫ్యామిలీ నుంచి ఒక వారసురాలు సినిమాల్లోకి అడుగుపెట్టబోతోందనే పుకార్లు జోరుగా ఊపందుకున్నాయి. ఇంతకు ఆమె మరెవ్వరో కాదు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar).


గత కొంతకాలం నుంచి సారా రకరకాల వార్తలతో లైమ్‌లైట్‌లో ఉంది. అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటోషూట్‌లతోనూ సామాజిక మాధ్యమాల్లో అలజడి వాతావరణం సృష్టిస్తోంది. ఈమధ్య సినిమా తారలతోనూ ఎక్కువగా స్నేహంగా మెలుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. సారా ఏదో ఒకరోజు సినిమాల్లో అడుగుపెట్టొచ్చన్న వాదనలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడవి నిజం కాబోతున్నాయని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇందుకు ఓ వీడియోని సాక్ష్యంగా చూపుతోంది. అందులో సారా నీలం రంగు గౌనులో ఎంతో అందంగా కనిపించింది. ఓ హోటల్ నుంచి బయటకు వచ్చిన ఆమె.. స్టూడియో సెటప్ కలిగిన ఓ వ్యానిటీ వ్యాన్‌లోకి నేరుగా వెళ్లింది. సాధారణంగా.. సినిమా తారలు ఇలాంటి వ్యానిటీ వ్యాన్‌లు వాడుతుంటారు. ఇప్పుడు సారా దాన్ని వాడుతుండటంతో.. ఆమె సినీ రంగప్రవేశం చేస్తోందా? అనేది చర్చనీయాంశంగా మారింది.


ఈ విషయంపై సారా ఇంతవరకూ నోరు మెదపలేదు కానీ, సన్నిహితులు మాత్రం ఆమెకు నటనపై చాలా ఆసక్తి ఉందని పేర్కొంటున్నారు. ఈ అంశంపై ఒకరు మాట్లాడుతూ.. ‘‘సారాకు నటనపై ఎంతో ఆసక్తి ఉంది. ఆమె కొన్ని బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరించడం వల్ల నటనపై కొన్ని పాఠాలు కూడా తీసుకుంది. సారా త్వరలోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టినా పెట్టొచ్చు. ఆమె ఎంతో ప్రతిభావంతురాలు. కెరీర్ విషయంలో తల్లిదండ్రులకు సారాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వృత్తిరీత్యా సారా ఓ మోడల్ కూడా’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ లెక్క ప్రకారం.. సారా బాలీవుడ్ ఎంట్రీకి ఇంకెంతో దూరం లేదని అర్థం చేసుకోవచ్చు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 17 , 2024 | 06:53 PM

Advertising
Advertising
<