ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shakib: పోలింగ్ రోజు అభిమాని చెంప పగలగొట్టిన షకీబ్.. వీడియో ఇదిగో!

ABN, Publish Date - Jan 08 , 2024 | 12:09 PM

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటాడు. మైదానంలో తన చేష్టలతో తోటి క్రికెటర్లతో గొడవకు దిగుతుంటాడు. ఒకానొక సమయంలో అంపైర్లతో కూడా గొడవపడ్డాడు.

ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటాడు. మైదానంలో తన చేష్టలతో తోటి క్రికెటర్లతో గొడవకు దిగుతుంటాడు. ఒకానొక సమయంలో అంపైర్లతో కూడా గొడవపడ్డాడు. దీంతో గొప్ప ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ లేనిపోని వివాదాలతో తన స్థాయిని తగ్గించుకున్నాడు. అయితే ఇటీవల రాజకీయాల్లో అడుగుపెట్టిన షకీబ్ అక్కడ వివాదంలో చిక్కుకున్నాడు. పోలింగ్ రోజున ఓ అభిమాని చెంప చెల్లుమనిపించి వార్తల్లోకి ఎక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షకీబ్ ఎంపీగా విజయం సాధించిన సమయంలో బయటికొచ్చిన ఈ వీడియో అతడిని వివాదాల్లోకి నెట్టేసింది. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ పార్టీ తరఫున షకీబ్ అల్ హసన్ పోటీలో నిలిచాడు. మగురా-1 నియోజకవర్గం నుంచి పోటీకి దిగాడు. ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఆదివారం జరిగింది.


ఈ నేపథ్యంలో షకీబ్ పోలింగ్ సరళిని పరిశీలించేందుకు తన నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూతు వద్దకు వెళ్లాడు. దీంతో షకీబ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ అభిమాని షకీబ్ చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇది ఏమాత్రం నచ్చని షకీబ్ అభిమాని చెంపపగలగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షకీబ్‌పై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి కాజీ రెజాల్ హుస్సేన్‌పై షకీబ్ అల్ హసన్ 1,50,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో హుస్సేన్‌కు 45,993 ఓట్లు మాత్రమే వచ్చాయి. షకీబ్ పోటీ చేసిన అవామీ లీగ్ పార్టీ మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంది. 40 శాతం పోలింగ్ మాత్రమే నమోదైనా ఈ ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ఏకంగా 200 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ వరుసగా ఐదో సారి అధికారంలోకి వచ్చింది.

ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 12:16 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising