ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sheffield Shield: ఇదెక్కడి మాస్ రా మామా.. ఫీల్డ్ సెట్టింగ్‌తోనే పిచ్చెక్కించారు

ABN, Publish Date - Nov 04 , 2024 | 03:36 PM

Sheffield Shield: క్రికెట్‌లో కొన్ని టీమ్స్ బ్యాటింగ్‌తో, మరికొన్ని బౌలింగ్ బలంతో భయపెడతాయి. ఫీల్డింగ్ పవర్‌తో వణికించే టీమ్స్ కూడా ఉన్నాయి. అయితే ఫీల్డ్ సెట్టింగ్‌తోనే ప్రత్యర్థి జట్లకు ఊపిరాడకుండా చేయడం మాత్రం అందరికీ సాధ్యం కాదు.

క్రికెట్‌లో కొన్ని టీమ్స్ బ్యాటింగ్‌తో, మరికొన్ని బౌలింగ్ బలంతో భయపెడతాయి. ఫీల్డింగ్ పవర్‌తో వణికించే టీమ్స్ కూడా ఉన్నాయి. అయితే ఫీల్డ్ సెట్టింగ్‌తోనే ప్రత్యర్థి జట్లకు ఊపిరాడకుండా చేయడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. టైట్ ఫీల్డింగ్ పెట్టాలంటే మెరికల్లాంటి ఫీల్డర్లతో పాటు అద్భుతమైన బౌలింగ్ అటాక్ ఉండాలి. ఫీల్డింగ్ పొజిషన్స్‌కు తగ్గట్లు బౌలింగ్ చేయగలగాలి. ఇలాంటి ఫీల్డింగ్ సెట్ చేయడంలో ఆస్ట్రేలియా ఆరితేరింది. ఆ జట్టు మ్యాచ్ సిచ్యువేషన్స్‌కు తగ్గట్లు సర్కిల్‌లోకి ఒక్కో ఫీల్డర్‌ను తీసుకొస్తూ ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటుంది. మరోసారి కంగారూలు ఫీల్డ్ సెట్టింగ్‌తో పిచ్చెక్కించారు.


బ్యాటర్లతో ఆడుకున్నారు

ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో వినూత్న ఘటన చోటుచేసుకుంది. సౌత్ ఆస్ట్రేలియా, విక్టోరియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో డిఫరెంట్ ఫీల్డ్ సెటప్ కనిపించింది. విక్టోరియా ఇన్నింగ్స్ సమయంలో చివరి వికెట్ తీసేందుకు సౌత్ ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లంతా సర్కిల్‌లోకి వచ్చేశారు. వారెన్ (1), మెక్లూర్ (0) పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టైట్ ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి టెయిలెండర్లను భయపెట్టాడు అలెక్స్ క్యారీ. ఈ సౌత్ ఆస్ట్రేలియా కెప్టెన్ స్లిప్స్‌లోనే ఏకంగా ఐదుగురు ఫీల్డర్లను మోహరించాడు.


అష్టదిగ్బంధనం అంటే ఇదేనేమో..

సిల్లీ పాయింట్‌లో ఒకరు, స్క్వేర్ లెగ్‌లో మరో ఫీల్డర్‌ను పెట్టాడు అలెక్స్ క్యారీ. బౌలర్, కీపర్‌తో కలుపుకొని సర్కిల్‌లోనే మొత్తం తొమ్మిది మంది ఆటగాళ్లు పొజిషన్స్ తీసుకున్నారు. దీంతో బెదిరిపోయిన బ్యాటర్ మెక్లూర్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బాల్ టచ్ చేసినా ఔట్, గాల్లోకి లేపినా ప్రమాదమే అలాగని వదిలేస్తే ఎల్బీడబ్ల్యూ, క్లీన్‌బౌల్డ్ అయ్యే డేంజర్ ఉండటంతో ఏం చేయాలో అతడికి పాలుపోలేదు. అయినా బౌలర్ లాయిడ్ పాప్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడబోయి వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఫీల్డ్ సెట్టింగ్ చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇదెక్కడి మాస్ రా మావా అంటున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా 138 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.


Also Read:

గంభీర్ అధికారాలకు చెక్ పెట్టనున్న బీసీసీఐ?

వివాదాస్పదమైన ‘బంతి మార్పు’

రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్..

For More Sports And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 03:39 PM