ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shubman Gill: ఆ ఇద్దరి స్థానంపై శుభ్‌మన్ కన్ను.. సక్సెస్ అవుతాడా?

ABN, Publish Date - Jul 06 , 2024 | 03:28 PM

టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకడంతో.. ఓపెనర్లుగా వారి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్..

Shubman Gill

టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) వీడ్కోలు పలకడంతో.. ఓపెనర్లుగా వారి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20లకు తాను ఓపెనర్‌గా ఉండాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. తాను ఇదివరకే టీ20 ఫార్మాట్‌లోనే ఓపెనర్‌గా వచ్చానని.. అంతర్జాతీయ టీ20ల్లోనూ (T20I) ఓపెనర్‌గా రాణించాలనుందని తెలిపాడు. కానీ.. రోహిత్, కోహ్లీల స్థాయిని అందుకోవడం కష్టమేనని అన్నాడు. ప్రతిఒక్కరికీ సొంత లక్ష్యాలుంటాయని.. వాటిని అందుకోవడానికి తాను ప్రయత్నిస్తానని వివరించాడు.


శుభ్‌మన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఓపెనింగ్ చేశారు. నేను కూడా టీ20Iల్లో ఓపెనింగ్ బ్యాటర్‌గా రావాలనుకుంటున్నా. ఒత్తిడి, అంచనాలు అనేవి తప్పకుండా ఉంటాయి. కానీ.. రోహిత్, కోహ్లీ స్థాయికి చేరుకోవడం మాత్రం కష్టంతో కూడుకున్న పని. ప్రతి ఆటగాడికి తనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని అందుకోవడమే ఒత్తిడితో కూడుకున్న పని. కానీ.. మనపై ఇతరులు పెట్టుకున్న అంచనాల్ని అందుకోవాలంటే మాత్రం మనపై మరింత ఒత్తిడి ఉంటుంది’’ అని చెప్పాడు. ఆ ఒత్తిడిని అధిగమించి ఉత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. మరి.. ఓపెనర్‌గా గిల్ ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.


ఇక కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. తాను ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు చాలా పాఠాలు నేర్చుకున్నానని అన్నాడు. ముఖ్యంగా.. తనతో పాటు లీడర్‌షిప్ గురించి ఎన్న విషయాలు తెలుసుకున్నానని చెప్పాడు. కెప్టెన్‌గా ఎదుర్కొనే సవాళ్లు మానసికంగా ఉంటాయని తాను గ్రహించానన్నాడు. ఆటగాళ్లందరూ ప్రతిభావంతులేనని.. కానీ ఫీల్డ్‌లో ఆ నైపుణ్యాన్ని ఎలా అందించగలరనే కాన్ఫిడెన్స్ వారిలో నింపడమే కెప్టెన్ బాధ్యత అని వెల్లడించాడు. తమ జట్టులో ఉన్న వాళ్లందరూ యువ ఆటగాళ్లేనని.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఎలా రాణించాలో జింబాబ్వేతో జరిగే సిరీస్ తోడవుతుందని చెప్పుకొచ్చాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 06 , 2024 | 03:28 PM

Advertising
Advertising
<