ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cricket: ఈ క్యాప్ విలువ 2 కోట్లు.. సచిన్, కోహ్లీది కాదు.. ఏ ప్లేయర్‌దో చెప్పండి చూద్దాం

ABN, Publish Date - Dec 03 , 2024 | 02:14 PM

Cricket: క్రికెటర్లకు సంబంధించిన జెర్సీలు, హెల్మెట్, బ్యాట్, క్యాప్స్ లాంటివి వేలం వేయడం చూస్తుంటాం. అలాగే ఓ దిగ్గజ ఆటగాడి క్యాప్‌పై ఆక్షన్‌‌ నిర్వహించారు. అది కళ్లుచెదిరే ధరకు అమ్ముడుబోనుందని తెలుస్తోంది.

క్రికెటర్లకు సంబంధించిన జెర్సీలు, హెల్మెట్, బ్యాట్, క్యాప్స్ లాంటివి వేలం వేయడం చూస్తుంటాం. అలాగే ఓ దిగ్గజ ఆటగాడి క్యాప్‌పై ఆక్షన్‌‌ నిర్వహించారు. అది కళ్లుచెదిరే మొత్తానికి అమ్ముడుపోవొచ్చని తెలుస్తోంది. బ్యాగీ గ్రీన్ క్యాప్ ఏకంగా రూ.2.2 కోట్ల ధర పలికే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో ఈ ఖరీదైన టోపీ ఎవరిది? అని తెలుసుకునే పనిలో పడ్డారు క్రికెట్ అభిమానులు. అయితే చాలా మంది అది బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ లేదా మోడర్న్ గ్రేట్ విరాట్ కోహ్లీదో అని అనుకుంటున్నారు. కానీ అది మరో దిగ్గజ బ్యాటర్‌ది. మరి.. ఊహించని ధర పలుకుతున్న ఆ క్యాప్ ఏ క్రికెటర్‌దో ఇప్పుడు తెలుసుకుందాం..


ఆ దిగ్గజానిదే..

ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ధరించిన క్యాప్‌ను మంగళవారం వేలం వేయనున్నారు. ఇవాళ జరిగే ఆక్షన్‌లో ఈ క్యాప్ సుమారుగా రూ.2.20 కోట్ల ధర పలకొచ్చని అంచనా. ఆస్ట్రేలియా జట్టు తరఫున టెస్టుల్లో బరిలోకి దిగే ప్లేయర్లకు ఆకుపచ్చ రంగుతో కూడిన బ్యాగీ గ్రీన్ క్యాప్‌లను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. చాలా మంది స్టార్లు సుదీర్ఘ కెరీర్‌లో చిరిగినా, రంగు వెలసినా దాన్నే ఉపయోగించడం అలవాటుగా మారింది. అందుకే ఈ టోపీలపై క్రికెట్ ఫ్యాన్స్‌లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది.


77 ఏళ్ల చరిత్ర

వేలం బరిలోకి రానున్న బ్రాడ్‌మన్ క్యాప్‌కు భారీ చరిత్రే ఉంది. దాదాపు 77 ఏళ్ల కింద దీన్ని వాడారు ఆసీస్ లెజెండ్. 1947-48లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది భారత జట్టు. దేశానికి స్వాతంత్ర్యం లభించాక విదేశీ గడ్డపై మన టీమ్ ఆడిన తొలి సిరీస్ ఇదే. 5 టెస్టుల ఆ సిరీస్‌ను 4-0తో సొంతం చేసుకున్నారు కంగారూలు. ఆ సిరీస్‌లో 178.75 సగటుతో ఏకంగా 715 పరుగులు చేశాడు బ్రాడ్‌మన్. ఒక ద్విశతకం సహా 4 శతకాలు, 1 అర్ధ శతకం బాదాడు. టీమిండియాపై బ్రాడ్‌మన్ ఆడిన ఏకైక సిరీస్ ఇదే కావడం విశేషం. ఆ సిరీస్‌లో అతడు ధరించిన టోపీ ఇప్పుడు వేలానికి వచ్చింది.


Also Read:

70 వేల కోట్లకు వారసుడు.. 22 ఏళ్లకే రిటైర్మెంట్

అశ్విన్‌.. అవసరమెంత?

5 పరుగులు 4 వికెట్లు

కతార్‌ జీపీ విజేత వెర్‌స్టాపెన్‌

For More Sports And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 02:19 PM