ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Team India: 24 ఏళ్లలో తొలిసారి.. టీమిండియాకు చెత్త రికార్డు ముప్పు

ABN, Publish Date - Oct 29 , 2024 | 08:11 AM

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిదైన మూడవ టెస్ట్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేయాలని పర్యాటక జట్టు కివీస్ ఉవ్విళూరుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే టీమిండియా ఖాతాలో అత్యంత చెత్త రికార్డు పడుతుంది. వివరాలు ఇవే

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇప్పటికే సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. రోహిత్, కోహ్లీ కూడా విఫలమవడంతో బెంగళూరు, పూణే టెస్టుల్లో ఓటములను మూటగట్టుకుంది. ఇక చివరిదైన మూడవ టెస్ట్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని పర్యాటక జట్టు కివీస్ ఉవ్విళూరుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే భారత్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు పడుతుంది.


24 ఏళ్ల క్రితం వైట్‌వాష్

ముంబై టెస్టులో భారత్ ఓడిపోతే.. గత 24 ఏళ్లలో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో జట్టు వైట్‌వాష్‌కు గురవడం ఇదే తొలిసారి అవుతుంది. చివరిసారిగా 2000లో టీమిండియా ఈ పరాభవాన్ని ఎదుర్కొంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో గెలుచుకుంది. ఆ సిరీస్‌లో ముంబైలో జరిగిన మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో, బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌ను ఇన్నింగ్స్, 71 పరుగుల తేడాతో కైవసం చేసుకుంది. సచిన్ టెండూల్కర్ నాటి జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సిరీస్‌లో భారత జట్టు అత్యంత పేలవంగా ప్రదర్శన చేసింది. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా 250 ప్లస్ పరుగుల మార్కును దాటలేకపోయింది. దక్షిణాఫ్రికా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. ఈ సిరీస్‌లో పర్యాటక జట్టు అత్యధికంగా 479 స్కోరు నమోదు చేసింది. దీనిని బట్టి దక్షిణాఫ్రికా ఎంత బాగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు.


0-3తో క్లీన్ స్వీప్ చేసిన శ్రీలంక

టీమిండియా 1997లో మరింత దారుణంగా 0-3 తేడాతో టెస్ట్ సిరీస్‌ను ఓడిపోయిన స్వదేశంలో అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకుంది. శ్రీలంక జట్టు చిత్తుచిత్తుగా ఓడించింది. నాటి జట్టుకు కూడా సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌‌గా ఉన్నాడు. అర్జున్ రణతుంగ నేతృత్వంలోని శ్రీలంక జట్టు సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. దీంతో అత్యంత అవమానకర రీతిలో టెస్ట్ సిరీస్‌ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇక ముంబై వేదికగా జరిగే మూడవ టెస్టులో న్యూజిలాండ్ గెలిస్తే రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ఖాతాలో అవాంఛిత రికార్డు చేరుతుంది.


కాగా కివీస్ చేతిలో 0-2 తేడాతో భారత ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయింది. 2012 నుంచి స్వదేశంలో వరుసగా 18 టెస్ట్ సిరీస్‌ విజయాలు సాధించిన టీమిండియాకు న్యూజిలాండ్ బ్రేకులు వేసింది. మూడవ టెస్టు కూడా కివీస్ గెలిస్తే చిరస్మరణీయ విజయంగా మారిపోనుంది. ఇదిలావుండగా ముంబై టెస్టులో గెలవడం భారత జట్టుకు అత్యంత కీలకం.ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యా్చ్ చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్‌లో కూడా అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారే ముప్పు పొంచివుంది.


ఇవి కూడా చదవండి

కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు

కేఎల్ రాహుల్‌కు లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని షాక్..

ఉగ్రవాదుల చేతుల్లో ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి.. ఎలా జరిగిందంటే

For more Viral News and Telugu News

Updated Date - Oct 29 , 2024 | 11:10 AM