ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Champions Trophy 2025: భారత జట్టు పాకిస్తాన్‌కి వెళ్తుందా.. బీసీసీఐ నుంచి షాకింగ్ లీక్

ABN, Publish Date - Jul 11 , 2024 | 12:58 PM

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో.. ఆ టోర్నీ ఆడేందుకు పాక్ గడ్డపై భారత్ అడుగుపెడుతుందా? అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇప్పటికే..

Champions Trophy 2025

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy 2025) టోర్నమెంట్‌కు పాకిస్తాన్ (Pakistan) ఆతిథ్యం ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో.. ఆ టోర్నీ ఆడేందుకు పాక్ గడ్డపై భారత్ అడుగుపెడుతుందా? అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొననున్న ఇతర దేశాలు తమకు పాక్‌లో ఆడేందుకు అభ్యంతరం లేదని తెలిపాయి. కానీ, భారత్ మాత్రం స్పందించలేదు. పాక్‌లోనే ఆడుతారా? లేక హైబ్రిడ్ మోడల్‌ని ప్రతిపాదిస్తారా? అనేది సస్పెన్స్‌గానే ఉంది. ఇలాంటి తరుణంలో.. బీసీసీఐ (BCCI) నుంచి ఓ షాకింగ్ లీక్ బయటకు వచ్చింది.


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ టోర్నీ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లే అవకాశమే లేదని బీసీసీఐ తేల్చి చెప్పిందట. ఇప్పటికే ఈ విషయాన్ని ఐసీసీకి బీసీసీఐ వర్గాలు తెలియజేసినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా.. భారత జట్టుని పాక్‌కు పంపించే ప్రసక్తే లేదని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లో లేదా శ్రీలంకలో నిర్వహించాలని కోరికట్లు తెలిసింది. ఎలాగైతే ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారో.. ఆ తరహాలోనే ఛాంపియన్స్ ట్రోఫీలోని భారత జట్టు మ్యాచ్‌లను నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేసినట్లు సమాచారం. నిజానికి.. వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు పాక్ జట్టు భారత్‌కు వచ్చింది కాబట్టి, ఈసారి భారత్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అక్కడికి వెళ్లొచ్చని అంతా అనుకున్నారు. కానీ.. బీసీసీఐ మాత్రం అందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌కే మొగ్గు చూపుతోంది. మరి.. దీనిపై ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తాయో చూడాలి.


కాగా.. పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో.. మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్‌ని ఐసీసీకి పీసీబీ సమర్పించింది. ఇతర దేశాలన్నీ పాక్‌లో ఆడేందుకు సమ్మతి తెలిపాయి కానీ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత తమ అభిప్రాయం వెల్లడిస్తామని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. తాము భారీ భద్రతా కల్పిస్తామని పీసీబీ హామీ ఇస్తున్నా.. బీసీసీఐ మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదు. ఇరుదేశాల మధ్య ఉన్న విభేదాల కారణంగానే.. టీమిండియా పాక్‌కు వెళ్లడం లేదు. ఇప్పుడు కూడా వెళ్లకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 11 , 2024 | 12:58 PM

Advertising
Advertising
<