Cricket: టీమిండియా కొత్త జెర్సీపై విమర్శలు.. బీసీసీఐ చేసిన తప్పేంటి..
ABN, Publish Date - Nov 29 , 2024 | 07:39 PM
Cricket: భారత క్రికెట్‌కు సంబంధించిన ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. టీమిండియాతో పాటు ప్లేయర్లకు సంబంధించిన విశేషాలను తెలుసుకునేందుకు ఫ్యాన్స్ చూపించే ఉత్సాహమే దీనికి కారణం.
Team India New Jersey: భారత క్రికెట్‌కు సంబంధించిన ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. టీమిండియాతో పాటు ప్లేయర్ల గురించిన విశేషాలను తెలుసుకునేందుకు ఫ్యాన్స్ చూపించే ఉత్సాహమే దీనికి కారణం. తాజాగా ఇండియన్ క్రికెట్‌కు సంబంధించి ఓ విషయం హైలైట్ అవుతోంది. అదే కొత్త జెర్సీ. ఐసీసీ ఛైర్మన్ జైషా, స్టార్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కలసి టీమిండియా కొత్త జెర్సీని ఆవిష్కరించారు. జాతీయ పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు ఆటగాళ్లు కూడా ఇదే జెర్సీని ధరించనున్నారు. వన్డే ఫార్మాట్ కోసం తీసుకొచ్చిన నయా జెర్సీ ఫొటోలు రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీని చుట్టూ వివాదం నెలకొంది.
ఇదేం జెర్సీ?
కొత్త జెర్సీలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. రంగు ముదురుగా ఉండటంతో ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. లైట్ కలర్‌తో నింపేశారని.. బాగోలేదని కొందరు నెటిజన్స్ అంటున్నారు. దీని కంటే ప్రస్తుత జెర్సీ బెటర్ అని చెబుతున్నారు. టీ-షర్ట్‌పై దేశం పేరు కంటే స్పాన్సర్ కంపెనీ పేరు పెద్ద సైజులో ఉందని.. ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జెర్సీ డిజైన్ విషయంలో బీసీసీఐ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందని.. పాత జెర్సీలతో పోలికలు, ముదురు రంగు, దేశం పేరు కాస్త చిన్న సైజులో ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.
ఆ మ్యాచ్‌తో అందుబాటులోకి..
జెర్సీ బాగుందంటున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఇంతకుముందు వాటితో పోలిస్తే ఇది క్లాస్‌గా, కూల్‌గా ఉందని కొందరు నెటిజన్స్ అంటున్నారు. మొదట్లో అలాగే అనిపిస్తుందని.. కానీ పోను పోనూ వీటికి అందరూ ఫ్యాన్స్ అయిపోతారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త జెర్సీలను డిజైన్ చేయించింది బీసీసీఐ. అయితే ఆ టోర్నీ కంటే ముందే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే వన్డే మ్యాచ్‌లో ఈ జెర్సీలతో బరిలోకి దిగనుంది రోహిత్ సేన. వివాదాన్ని పక్కనబెడితే.. ఈ కొత్త జెర్సీ భారత్‌కు మరో ఐసీసీ ట్రోఫీ అందిస్తుందేమో చూడాలి.
Also Read:
పాపం.. 25 ఏళ్లకే కెరీర్ క్లోజ్
పంత్, అయ్యర్ కాదు.. ఐపీఎల్‌లో అత్యధిక ప్యాకేజ్ ఇతడికే..
అరెరె.. కోహ్లీకి ఇలా జరిగిందేంటి.. ఇక్కడ కూడా అతడి డామినేషనేనా..
For More Sports And Telugu News
Updated Date - Nov 29 , 2024 | 08:27 PM