ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KKR vs SRH: వర్షం కారణంగా హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ రద్దైతే?.. రూల్స్ ప్రకారం..!

ABN, Publish Date - May 21 , 2024 | 04:17 PM

ఐపీఎల్-2024లో నేటి (మంగళవారం) నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు షురూ కానున్నాయి. అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs SRH) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిపోయిన జట్టు క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

ఐపీఎల్-2024లో నేటి (మంగళవారం) నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు షురూ కానున్నాయి. అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs SRH) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిపోయిన జట్టు క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.


కాగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న క్వాలిఫయర్ మ్యాచ్‌ కోసం టికెట్లు అన్ని అమ్ముడుపోయాయి. ఉత్కంఠ భరిత పోరుకు ఇరు జట్లు సంసిద్ధమయ్యాయి. మరికొన్ని గంటల్లోనే మ్యాచ్‌ కూడా ఆరంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌ సజావుగా సాగాలంటే మాత్రం వరుణ దేవుడి అనుగ్రహం ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదే వేదికగా లీగ్ దశలో ఒక మ్యాచ్‌ కూడా రద్దయ్యింది. దీంతో వర్షం ఏమైనా అంతరాయం కలిగిస్తుందా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నిజంగా వర్షం వచ్చి మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి?. ఐపీఎల్ రూల్స్ ఏం చెబుతున్నాయి?.. ఒక లుక్కేద్దాం...


ఐపీఎల్-2024లో గత వారం వర్షం కారణంగా ఏకంగా మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. అయితే ప్లే ఆఫ్స్ దశలో మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే రిజర్వ్ డే‌లు అందుబాటులో ఉంటాయి. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ నిర్వహించలేకపోతే మరుసటి రోజున మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఈ మేరకు నాలుగు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లకూ రిజర్వ్ డేలు ఉన్నాయి. ఐపీఎల్‌ ప్లేయింగ్ కండిషన్స్‌లోని రూల్ 13.7.3 ప్రకారం.. వర్షం ఆటంకం కలిగిస్తే మ్యాచ్ నిర్వహణ కోసం అదనంగా 2 గంటలపాటు వేచిచూడవచ్చు. లీగ్ దశలో కూడా ఈ నిబంధన ఉన్నప్పటికీ రిజర్వ్ డే ఆప్షన్ మాత్రం ఉండదు. గత సీజన్ మాదిరిగా కాకుండా ఈసారి ఫైనల్ సహా అన్ని ప్లే ఆఫ్ మ్యాచ్‌లకూ రిజర్వ్ డేలను నిర్వాహకులు కేటాయించారు. కాగా రిజర్వ్ డే నాడు మ్యాచ్‌ జరిగితే మొదటి నుంచి ఆరంభమవుతుంది.

Updated Date - May 21 , 2024 | 04:18 PM

Advertising
Advertising