T20 World Cup: భారత టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఆ ఇద్దరు విధ్వంసకర వీరులకు చోటు..?
ABN, Publish Date - Apr 17 , 2024 | 09:11 PM
టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్నకొద్దీ.. భారత జట్టులో స్థానం పొందే ఆటగాళ్లు ఎవరు? అనే ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ఆల్రెడీ రోహిత్ శర్మ కెప్టెన్ అని తేలిపోగా.. ఇతర ఆటగాళ్ల విషయంలోనే సరైన క్లారిటీ లేకుండా పోయింది. ఈ నెలాఖరులోపు జట్టుని..
టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) సమీపిస్తున్నకొద్దీ.. భారత జట్టులో స్థానం పొందే ఆటగాళ్లు ఎవరు? అనే ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ఆల్రెడీ రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్ అని తేలిపోగా.. ఇతర ఆటగాళ్ల విషయంలోనే సరైన క్లారిటీ లేకుండా పోయింది. ఈ నెలాఖరులోపు జట్టుని ప్రకటించే అవకాశం ఉందని, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో (IPL 2024) ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా కొన్ని ఎంపికలు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే.. సెలెక్టర్లు ఇప్పటికే 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని ఎంపిక చేశారని సమాచారం. వారిలో 15 మంది రెగ్యులర్ సభ్యులు ఉండగా.. ఐదుగురు స్టాండ్ బై ఆటగాళ్లని వార్తలు వస్తున్నాయి.
ఎన్నారైలకు ఓటు హక్కు ఉందా.. జైల్లో ఉన్న వ్యక్తి ఓటు వేయొచ్చా?
అందరూ ఊహించినట్టుగానే.. భారత జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) చోటు దక్కిందని, అతనితో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాని (Hardik Pandya) కూడా ఎంపిక చేశారని తెలుస్తోంది. నిజానికి.. ఐపీఎల్‌లో హార్దిక్ ప్రదర్శన పేలవంగా ఉండటంతో పాటు ఫిట్‌గా లేడన్న వాదనలు వినిపిస్తుండటంతో.. అతనికి జట్టులో చోటు దక్కకపోవచ్చని అంతా భావించారు. అతని సెలక్షన్ గురించి కెప్టెన్ రోహిత్‌తో పాటు రాహుల్ ద్రవిడ్, అజిత్ అగార్కర్‌లు రెండు గంటలపాటు చర్చించినట్లు వార్తలూ వచ్చాయి. అయితే.. హార్దిక్‌ని రీప్లేస్ చేసే మరో పవర్‌ఫుల్ ఆల్‌రౌండర్ లేకపోవడం, గతంలోనూ అతడు కీలకమైన మ్యాచెస్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు ఉండటంతో.. అతడ్ని జట్టులో తీసుకున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి.
IPL 2024: ‘కోహ్లీ, ధోనీనే కాదు.. ఆ ఆటగాడు కూడా ఓ లెజెండ్’
అంతేకాదు.. ఈమధ్య కాలంలో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో తమదైన ముద్ర వేసిన శివమ్ దూబే (Shivam Dube), రింకూ సింగ్ (Rinku Singh) సైతం వరల్డ్‌కప్ జట్టులో స్థానం సంపాదించుకున్నారని ప్రచారం జరుగుతోంది. వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడటంతో వీళ్లిద్దరు తమకు తామే సాటి కాబట్టి.. కీలకమైన సమయాల్లో బాగా ఆడుతారన్న నమ్మకంతో ఎంపిక చేసినట్లు తెలిసింది. అలాగే.. ఈ మెగాటోర్నీలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని కూడా సమాచారం అందుతోంది. అయితే.. ఇది కేవలం ప్రచారం మాత్రమే. భారత జట్టుపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నెలాఖరులోపు.. బీసీసీఐ భారత జట్టుని ప్రకటించే ఆస్కారం ఉందని వార్తలొస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 17 , 2024 | 09:33 PM