ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Trump-Kohli: కోహ్లీకి గుడ్ టైమ్ స్టార్ట్.. అంతా ట్రంప్ మహిమ

ABN, Publish Date - Nov 06 , 2024 | 08:49 PM

Trump-Kohli: వరుస వైఫల్యాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లోనూ అతడు అంచనాలను అందుకోలేదు. ఈ తరుణంలో విరాట్‌కు ఓ గుడ్ న్యూస్.

వరుస వైఫల్యాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లో అతడు దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అంతకుముందు జరిగిన బంగ్లాదేశ్ సిరీస్‌లోనూ అంచనాలను అందుకోలేకపోయాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే.. పొట్టి ప్రపంచ కప్-2024 ఫైనల్‌లో ఆడిన సూపర్ ఇన్నింగ్స్‌ను మినహాయిస్తే మరో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కింగ్ బ్యాట్ నుంచి రాలేదు. దీంతో కోహ్లీ అభిమానులతో పాటు భారత జట్టు ఫ్యాన్స్ కూడా గుబులు పడుతున్నారు. అయితే వాళ్లందరికీ గుడ్ న్యూస్. విరాట్‌ టైమ్ స్టార్ట్ అయింది. ఇంక అతడ్ని ఆపడం ఎవరి తరం కాదు.


ట్రంప్‌కు థ్యాంక్స్

కోహ్లీకి గుడ్ టైమ్ స్టార్ట్ అయిపోయిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇక మీదట అతడి బ్యాట్ గర్జనను తట్టుకోవడం అపోజిషన్ టీమ్స్‌కు కష్టమేనని.. భారత జట్టుకు ఎదురుండదని చెబుతున్నారు. దీనికి అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు. అంతా ఆయన మహిమేనని.. కోహ్లీ టైమ్ స్టార్ట్ అవడానికి ట్రంపే కారణమని కామెంట్స్ చేస్తున్నారు. ట్రంప్‌కు విరాట్‌కు సంబంధం ఏంటనేదేగా మీ అనుమానం. అక్కడికే వస్తున్నాం.. కెరీర్ మొదట్లోనే మంచి బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు కోహ్లీ. అయితే అతడికి రియల్ సక్సెస్ వచ్చింది మాత్రం 2015లోనే. అక్కడి నుంచి అతడి బ్యాట్ జోరుకు అడ్డే లేకుండా పోయింది.


ఫామ్ కోల్పోయి పరేషాన్

2015 నుంచి 2021 వరకు కోహ్లీ ఒక రేంజ్‌లో చెలరేగాడు. వరల్డ్ క్రికెట్‌లో అసాధ్యం అనుకున్న ఎన్నో రికార్డులను అలవోకగా బ్రేక్ చేశాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ రన్ మెషీన్‌గా క్రేజ్ సంపాదించాడు. సరిగ్గా గమనిస్తే.. ఇది ట్రంప్ యూఎస్‌కు తొలి దఫా అధ్యక్షుడిగా ఉన్న కాలం కావడం గమనార్హం. 2016-2021 వరకు ట్రంప్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఆ సమయంలో కోహ్లీ ప్రపంచ క్రికెట్‌‌ను శాసించాడు. అయితే ట్రంప్ పదవిలో నుంచి దిగిపోవడం, విరాట్ ఫామ్ కోల్పోవడం కూడా ఒకే సమయంలో జరిగాయి.


గాడిన పడతాడా?

2020లో ఎన్నికల్లో ఓడిపోయి ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తప్పుకున్నారు ట్రంప్. అప్పటి నుంచి కోహ్లీకి కూడా బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. 2021 నుంచి 2023 మధ్య పరుగులు చేయడానికి ఈ తోపు బ్యాటర్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్ చేయడం మర్చిపోయినట్లు ఆడాడు. గతేడాది అడపాదడపా మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా.. 2024లో మళ్లీ ఫామ్ కోల్పోయాడు. అయితే ఇప్పుడు ట్రంప్ తిరిగి అగ్రరాజ్యం అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కోహ్లీకి కూడా గుడ్ టైమ్ స్టార్ట్ అయిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక మీదట కింగ్ ఎలా ఆడతాడో చూడాలి.


Also Read:

సౌతాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్.. ఫ్రీగా ఎలా చూడాలంటే..

ధోనీతో ట్రంప్.. యూఎస్ ప్రెసిడెంట్ సందడి మామూలుగా లేదుగా

ఐపీఎల్‌లో జాక్‌పాట్.. ఒక్క రోజులో మారిపోయిన క్రికెటర్ జీవితం

For More Sports And Telugu News

Updated Date - Nov 06 , 2024 | 08:49 PM