RCB-Virat Kohli: ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరడంపై తొలిసారి స్పందించిన విరాట్ కోహ్లీ
ABN, Publish Date - May 19 , 2024 | 06:56 PM
ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగంలో పాయింట్ల పట్టికలో చిట్టచివర స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ భావించలేదు. కానీ ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆర్సీబీ ఆటగాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఏకంగా వరుసగా ఆరు విజయాలు సాధించి అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టారు.
బెంగళూరు: ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగంలో పాయింట్ల పట్టికలో చిట్టచివర స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ భావించలేదు. కానీ ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆర్సీబీ ఆటగాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఏకంగా వరుసగా ఆరు విజయాలు సాధించి అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టారు. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీ ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. మైదానంలోనే కన్నీళ్లు చెమర్చాడు. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ ఆసక్తికరంగా స్పందించాడు.
‘‘దేవుడికి ఒక ప్లాన్ ఉంది. మనం చేసే కృషిని నిజాయితీగా చేస్తే చాలు. జట్టుగా కష్టపడే విషయంలో మనం నిజాయితీగా ఉన్నామనుకుంటున్నాను. అందుకే ఫలితం దక్కింది. ఇంతకన్నా ఎక్కువేమీ చెప్పదలచుకోలేదు. తర్వాతి మ్యాచ్‌పై ఫోకస్ పెడదాం’’ అని కోహ్లీ అన్నాడు. శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం అనంతరం ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ ఈ మేరకు స్పందించారు. ఇక ఆర్సీబీ ఫినిషర్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ... ధోనీ సిక్స్ కొట్టడం వల్లే బెంగళూరు గెలిచిందని వ్యాఖ్యానించాడు. ‘‘ ఈ రోజు జరిగిన గొప్ప విషయం ఏంటంటే ఎంఎస్ ధోనీ మైదానం వెలుపలకు సిక్స్ కొట్టడం. దాంతో మనకు కొత్త బంతి వచ్చింది. ఆ బంతితో బౌలింగ్ చేయడం సానుకూలమైంది’’ అని దినేశ్ కార్తీక్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
కాగా శనివారం రాత్రి ఆర్సీబీ నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఛేదించలేకపోయింది. 27 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ, సీఎస్కే చెరో 14 పాయింట్లతో ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్ కారణంగా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
Updated Date - May 19 , 2024 | 06:56 PM