ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన కోహ్లీ, బుమ్రా, రోహిత్
ABN, Publish Date - Jan 10 , 2024 | 08:05 AM
తాజాగా విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల జోరు కనిపించింది. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్ సత్తా చాటారు. తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరచుకున్నారు.
దుబాయ్: తాజాగా విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల జోరు కనిపించింది. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్ సత్తా చాటారు. తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరచుకున్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 3 స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు. ప్రస్తుతం కింగ్ కోహ్లీ ఖాతాలో 775 రేటింగ్ పాయింట్లున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన ర్యాంకును మెరుగుపరచుకున్నాడు. 4 స్థానాలు ఎగబాకి మళ్లీ టాప్ 10లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం 10వ ర్యాంకులో ఉన్న హిట్‌మ్యాన్ ఖాతాలో 748 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించలేకపోయినా పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ రెండు స్థానాలు కోల్పోయి 8వ ర్యాంకులో నిలిచాడు.
ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చెలరేగిన టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం ఎగబాకిన బుమ్రా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 787 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఏకంగా 13 స్థానాలు ఎగబాకిన మహ్మద్ సిరాజ్ 17వ ర్యాంకులో నిలిచాడు. ప్రస్తుతం సిరాజ్ ఖాతాలో 661 రేటింగ్ పాయింట్లున్నాయి. కాగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక స్థానాన్ని కోల్పోయి ఐదో ర్యాంకులో నిలిచాడు.
Updated Date - Jan 10 , 2024 | 08:10 AM