ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RCB: రాసి పెట్టుకోండి.. ఆర్సీబీకి అతడే కెప్టెన్: ఏబీ డివిలియర్స్

ABN, Publish Date - Nov 29 , 2024 | 03:28 PM

RCB: ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో స్టార్ ప్లేయర్లను కాకపోయినా మంచి ఆటగాళ్లను తీసుకోవడంలో సక్సెస్ అయింది ఆర్సీబీ. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్‌వుడ్ లాంటి నాణ్యమైన పేసర్లను తీసుకుంది.

వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం టీమ్స్ అన్నీ తమ ఆయుధాలను తయారు చేసుకున్నాయి. ఇటీవల జరిగిన మెగా ఆక్షన్‌లో తమకు కావాల్సిన ప్లేయర్లను తీసుకున్నాయి. కోట్ల వర్షం కురిపించి బలమైన స్క్వాడ్‌లను సిద్ధం చేసుకున్నాయి. క్యాష్ రిచ్ లీగ్‌లో హ్యూజ్ ఫ్యాన్‌బేస్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా మంచి ఆటగాళ్లను దక్కించుకుంది. ముఖ్యంగా తమ బౌలింగ్ లైనప్‌ను పటిష్టంగా చేసుకుంది. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్‌వుడ్ లాంటి సీనియర్ బౌలర్లతో ఆ జట్టు బౌలింగ్ అటాక్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. అటు విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్‌తో కూడిన బ్యాటింగ్ యూనిట్ కూడా బాగుంది. అయితే కెప్టెన్సీ ఇష్యూ మళ్లీ మొదటికొచ్చింది.


అతడికే పగ్గాలు

గత సీజన్ వరకు కెప్టెన్‌గా టీమ్‌ను ముందుండి నడిపించిన ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్సీబీ వదలుకుంది. వేలంలోనూ అతడ్ని రీటెయిన్ చేసుకోలేదు. దీంతో వచ్చే సీజన్‌లో ఆ జట్టుకు సారథి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోమారు ఆ జట్టు బాధ్యతల్ని చేపట్టాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. కానీ దీనిపై అటు బెంగళూరు మేనేజ్‌మెంట్ నుంచి గానీ ఇటు కోహ్లీ నుంచి గానీ ఎటువంటి హామీ రాలేదు. తాజాగా ఈ అంశంపై ఆర్సీబీ మాజీ ప్లేయర్, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. కోహ్లీనే బెంగళూరు జట్టు సారథ్య పగ్గాలు తీసుకుంటాడని.. రాసి పెట్టుకోవాలని అతడు వ్యాఖ్యానించాడు.


ఇంకో ఆప్షన్ లేదు

‘కెప్టెన్సీపై కోహ్లీ ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఆర్సీబీ స్క్వాడ్‌లో అతడ్ని మించిన కెప్టెన్సీ ఆప్షన్ కనిపించడం లేదు. ఆ టీమ్‌లో విరాట్ మాత్రమే సారథ్యం చేయగల సత్తా ఉన్న క్రికెటర్‌ అని చెప్పాలి. మెగా ఆక్షన్‌లో బెంగళూరు మంచి జట్టునే తీసుకుంది. భువనేశ్వర్, హేజల్‌వుడ్‌తో పాటు లుంగి ఎంగిడి లాంటి క్వాలిటీ పేసర్లను తీసుకున్నారు. స్లో డెలివరీస్‌తో అతడు ప్రత్యర్థులకు సమస్యలు సృష్టించగలడు. అయితే ఆర్సీబీ స్పిన్ యూనిట్ కాస్త ఆందోళన కలిగిస్తోంది. విన్నింగ్ స్పిన్నర్ లేని లోటును ఆ జట్టు ఎలా అధిగమిస్తుందో చూడాలి’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.


Also Read:

అరెరె.. కోహ్లీకి ఇలా జరిగిందేంటి.. ఇక్కడ కూడా అతడి డామినేషనేనా..

అరుదైన రికార్డు కొట్టి.. అంతలోనే దురదృష్టం వెంటాడింది

తీవ్ర విషాదం.. మ్యాచ్ ఆడుతూ కుప్పకూలిన క్రికెటర్..

For More Sports And Telugu News

Updated Date - Nov 29 , 2024 | 03:43 PM