ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SRH vs KKR: ఐపీఎల్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది?

ABN, Publish Date - May 26 , 2024 | 04:08 PM

ఎట్టకేలకు ఐపీఎల్ 2024 సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. ఆఖరి సమరానికి వేళయ్యింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో టైటిల్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా..

SRH vs KKR Final Match

ఎట్టకేలకు ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. ఆఖరి సమరానికి వేళయ్యింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో టైటిల్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌ జరగనుంది. లీగ్ దశ నుంచే ఈ రెండు జట్లు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణిస్తూ.. టాప్-2లో స్థానం సంపాదించాయి. అనంతరం క్వాలిఫైయర్, ఎలిమినేటర్ దశలు దాటేసి.. ఫైనల్‌కు చేరాయి. ఈ రెండు జట్లలో ఏ ఒక్కదాన్ని కూడా తక్కువ అంచనా వేయలేం కాబట్టి.. ఎవరు ఈ ఫైనల్ పోరులో విజేతగా నిలుస్తారు? ఏ జట్టు ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకుంటుంది? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Read Also: ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డ్ సొంతం

అయితే.. ఈ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ అధికారులు చెపాక్‌లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. శనివారమే వరుణుడు తన ప్రతాపం చూపించాడు. కుండపోత వర్షం కురవడంతో.. కోల్‌కతా జట్టు తన ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఆదివారం మరీ అంత భారీగా వర్షం పడే అవకాశం లేదని, ఉరుములతో కూడిన వర్షం ఒకటి నుంచి మూడు శాతం వరకు మాత్రమే ఉందని అధికారులు చెప్తున్నారు. అంటే.. మ్యాచ్ రద్దయ్యే స్థాయిలో భారీ వర్షం పడకపోవచ్చని సమాచారం. కానీ.. పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ ఉంది. దీంతో.. ఆ తర్వాతేంటి? అని క్రీడాభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ రద్దయితే ఏం చేస్తారు? తుది నిర్ణయం ఏం తీసుకుంటారు? అని చర్చించుకుంటున్నారు.

ఒకవేళ చెపాక్‌లో ఆదివారం వర్షం పడి మ్యాచ్ రద్దయితే.. రిజర్వ్ డే అయిన మరుసటి రోజున (మే 27వ తేదీ) ఆటను కొనసాగిస్తారు. ఆదివారం ఎక్కడైతే ఆట ఆగిపోతుందో, తిరిగి అక్కడి నుంచే సోమవారం కంటిన్యూ చేస్తారు. అయితే.. ఐపీఎల్ యాజమాన్యం మాత్రం రిజర్వ్ డేకు వెళ్లకుండా, ఆదివారమే మ్యాచ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అంటే.. వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే, రెండు గంటల అదనపు సమయాన్ని కేటాయించాలని చూస్తున్నారు. దురదృష్టవశాత్తూ మ్యాచ్ రద్దయితే.. సోమవారం కొనసాగించడం జరుగుతుంది. ఒకవేళ సోమవారం కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయితే మాత్రం.. టేబుల్ టాపర్స్‌ని విజేతగా అనౌన్స్ చేస్తారు. మరి.. ఆ టేబుల్ టాపర్స్ ఎవరో మీకు తెలిసిందేగా!

Read Latest Sports News and Telugu News

Updated Date - May 26 , 2024 | 04:08 PM

Advertising
Advertising