ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yashasvi Jaiswal: రోహిత్ శర్మను వెనక్కు నెట్టేసిన యశస్వీ.. అతడే టాప్!

ABN, Publish Date - Jul 10 , 2024 | 07:45 PM

భారత యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మను సైతం వెనక్కు నెట్టేసి టాప్ లేపేశాడు. అన్ని ఫార్మాట్లలో కలుపుకొని.. ఈ ఏడాదిలో..

Yashasvi Jaiswal

భారత యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మను (Rohit Sharma) సైతం వెనక్కు నెట్టేసి టాప్ లేపేశాడు. అన్ని ఫార్మాట్లలో కలుపుకొని.. ఈ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్రపుటలకెక్కాడు. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20I మ్యాచ్‌లో 36 పరుగులు చేసి.. అతను ఈ రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. మొత్తం 14 ఇన్నింగ్స్‌ల్లో అతను 65.23 సగటున 85.82 స్ట్రైక్‌రేట్‌తో 848 పరుగులు చేశాడు.


ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ 844 పరుగులతో (27 ఇన్నింగ్స్‌ల్లో) అగ్రస్థానంలో ఉండేవాడు. కానీ.. యశస్వీ అతడ్ని దాటేసి, నంబర్ వన్ ప్లేస్‌ని కొట్టేశాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాదిలో అతను 22 ఇన్నింగ్స్‌ల్లో 833 పరుగులు చేశాడు. రోహిత్ తర్వాత శ్రీలంక ప్లేయర్ కుసల్ మెండిస్ 833 పరుగులతో (26 ఇన్నింగ్స్) నాలుగో స్థానంలోనూ, ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 773 పరుగులతో (25 ఇన్నింగ్స్) ఐదో స్థానంలోనూ నిలిచారు.


ఇక్కడ విశేషం ఏమిటంటే.. జైస్వాల్ కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లోనే అంత భారీ స్కోరు చేయడం. మిగతా బ్యాటర్లందరూ 20కి పైగా ఇన్నింగ్స్‌లు ఆడితే.. 14 ఇన్నింగ్స్‌ల్లోనే అతను 800 పరుగుల మైలురాయిని దాటేసి, అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదే దూకుడు కొనసాగిస్తే.. బహుశా అతడు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరుని నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి.. ఈ ఏడాది ముగిసేలోపు అతడు ఎన్ని పరుగులు చేస్తాడో చూడాలి.

ఈ ఏడాదిలో ఇప్పటివరకూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు

* యశస్వీ జైస్వాల్: 848 పరుగులు (14)

* ఇబ్రహీం జద్రాన్: 844 పరుగులు (27)

* రోహిత్ శర్మ: 833 పరుగులు (22)

* కుసల్ మెండిస్: 833 పరుగులు (26)

* రహ్మానుల్లా గుర్బాజ్: 773 పరుగులు (25)

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 07:45 PM

Advertising
Advertising
<