ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IND vs ENG: చరిత్ర సృష్టించిన యశస్వీ జైస్వాల్.. తొలి ఎడమ చేతి బ్యాటర్‌గా..

ABN, Publish Date - Feb 24 , 2024 | 04:50 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న జైస్వాల్ ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. దీంతో ఈ సిరీస్‌లో 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు.

రాంచీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న జైస్వాల్ ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. దీంతో ఈ సిరీస్‌లో 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో జైస్వాల్ మినహా మరే బ్యాటర్ కనీసం 300 పరుగులు చేయలేదు. ఈ క్రమంలో ఓ టెస్ట్ సిరీస్‌లో 600 పరుగులు చేసిన తొలి భారత ఎడమ చేతి బ్యాటర్‌గా యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. అలాగే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో 600 పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ కూడా ఈ మార్కు అందుకున్నారు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న జైస్వాల్ నాలుగో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైనప్పటికీ జైస్వాల్ మాత్రం 73 పరుగులతో సత్తా చాటాడు. టెస్టుల్లో జైస్వాల్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ.


ఇక మ్యాచ్ విషయానికొస్తే రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడతోంది. 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో ధృవ్ జురేల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. వీరిద్దరు కలిసి టీమిండియా స్కోర్‌ను 200 దాటించారు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(2) వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు జైస్వాల్ 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

కానీ స్పిన్నర్ షోయబ్ బషీర్ టీమిండియాను దెబ్బకొట్టాడు. వరుస విరామాల్లో 3 కీలక వికెట్లు తీశాడు. గిల్, జైస్వాల్ భాగస్వామ్యాన్ని 25వ ఓవర్‌లో విడదీశాడు. 38 పరుగులు చేసిన గిల్‌ను లెగ్‌బైస్‌లో పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే రజత్ పటీదార్(17)ను కూడా లెగ్‌బైస్‌లో ఔట్ చేశాడు. 2 సిక్సులతో మంచి టచ్‌లో కనిపించిన జడేజా(12)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 130 పరుగులకే టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. 44 పరుగుల వ్యవధిలోనే టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్న జైస్వాల్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే తర్వాత మరోసారి చెలరేగిన బషీర్.. జైస్వాల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 161 పరుగులకు భారత జట్టు సగం వికెట్లు కోల్పోయింది. సర్పరాజ్ ఖాన్(14), రవిచంద్రన్ అశ్విన్ (1)ను మరో స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ తక్కువ స్కోర్లకే ఔట్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2024 | 04:50 PM

Advertising
Advertising