ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yashasvi Jaiswal: యశస్వీ జైస్వాల్ వరల్డ్ రికార్డ్.. కేవలం ఒక్క బంతిలోనే..

ABN, Publish Date - Jul 15 , 2024 | 03:04 PM

భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఒక్క బంతిలోనే 12 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఐదు మ్యాచ్‌ల..

Yashasvi Jaiswal

భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) ఓ అరుదైన ఘనత సాధించాడు. ఒక్క బంతిలోనే 12 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన చివరి మ్యాచ్‌లో అతడు ఈ రేర్ రికార్డ్ సృష్టించాడు. మొదటి ఓవర్‌లో తొలి బంతిని సికందర్ రజా ఫుల్-టాస్‌గా వేయగా.. దానిని జైస్వాల్ డీప్ స్క్వేర్ లెగ్ మీద సిక్సర్‌గా మలిచాడు. అయితే.. ఆ బంతి నో-బాల్ కావడంతో భారత్‌కు ఫ్రీ-హిట్ వచ్చింది. దీంతో.. అదే ఊపులోనే జైస్వాల్ తర్వాతి బంతినీ సిక్సర్‌గా మార్చాడు. ఇలా.. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ లీగల్ డెలివరీలో 12 పరుగులు (నో-బాల్‌తో కలిపితే 13) చేసిన ఏకైక క్రికెటర్‌గా జైస్వాల్ చరిత్రపుటలకెక్కాడు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. చివరి టీ20లో భారత్ 42 పరుగులతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (58) అర్థశతకంతో రాణించడం, చివర్లో శివమ్ దూబే (26) మెరుపులు మెరిపించడంతో.. భారత్ అంత స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేధనలో భాగంగా.. జింబాబ్వే బ్యాటర్లు తడబడ్డారు. భారత బౌలర్ల ధాటికి ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. మైయర్స్ (34), మారుమణి (27), అక్రమ్ (27) మాత్రమే పోరాటపటిమ కనబరిచారు. మిగిలిన బ్యాటర్లంతా చేతులు ఎత్తేయడంతో.. జింబాబ్వేకి ఘోర పరాజయం తప్పలేదు. ఈ విజయంతో భారత్ 4-1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది.


అభిషేక్ శర్మ సంచలన రికార్డు

ఇదే సిరీస్‌లో మరో యువ ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) సైతం ఓ సంచలన రికార్డును నమోదు చేసింది. ఒక టీ20 సిరీస్‌లో ఓ శతకం బాదడంతో పాటు రెండు వికెట్లు తీసిన ఏకైక భారతీయుడిగా రికార్డులకెక్కాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు సైతం ఇలాంటి ఫీట్‌ని సాధించలేదు. భారత్ తరఫున మొత్తం 10 మంది ఆటగాళ్లు టీ20ల్లో సెంచరీ చేశారు కానీ.. ఒక్కరు కూడా వికెట్ తీసిన దాఖలాలు లేనే లేవు. కాగా.. రెండో టీ20లో ఓపెనర్‌గా దిగిన అభిషేక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో సెంచరీ చేశాడు. కేవలం 47 బంతుల్లోనే 100 పరుగులు కొట్టాడు. ఆపై నాలుగు, ఐదో మ్యాచ్‌లలో చెరో వికెట్ చొప్పున మొత్తం రెండు వికెట్లు తీశాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 15 , 2024 | 03:04 PM

Advertising
Advertising
<