Yashasvi Jaiswal: సెంచరీ మిస్.. మరోసారి శుభ్‌మన్‌పై విమర్శలు.. యశస్వీ స్ట్రాంగ్ కౌంటర్
ABN, Publish Date - Jul 14 , 2024 | 05:02 PM
నాలుగో మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ సాధించిన విజయాన్ని పక్కన పెట్టేస్తే.. యశస్వీ జైస్వాల్ సెంచరీ మిస్ అవ్వడంపైనే అభిమానులు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేశారు. చివర్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూకుడుగా..
నాలుగో మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ సాధించిన విజయాన్ని పక్కన పెట్టేస్తే.. యశస్వీ జైస్వాల్ (Yashavsi Jaiswal) సెంచరీ మిస్ అవ్వడంపైనే అభిమానులు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేశారు. చివర్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) దూకుడుగా ఆడటం వల్లే అతని శతకం మిస్ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైస్వాల్‌కు శతకం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. తన సెల్ఫిష్ ఇన్నింగ్స్‌తో అతని సెంచరీని అడ్డుకున్నాడని, అతనికి స్ట్రైక్ ఇవ్వకుండా తన స్కోరింగ్ రేటు పెంచాడంటూ మండిపడ్డారు. అయితే.. ఈ విమర్శలకు జైస్వాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తామిద్దరం కలిసి మ్యాచ్‌ని ముగించడంపైనే ఫోకస్ పెట్టామని, సెంచరీ గురించి కాదని పేర్కొన్నాడు.
‘‘నేను, గిల్ కలిసి మ్యాచ్‌ని పూర్తి చేయడం గురించే ఆలోచించాం. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా.. విజయం సాధించాలనే లక్ష్యంతోనే ఆడాం. వికెట్ కోల్పోకుండా మ్యాచ్‌ని ముగించాలన్న ఆలోచనతోనే మా ప్రదర్శన కొనసాగించాం. నేను ఆడిన ఆటను ఎంతో ఆస్వాదించాను. మంచి స్కోరు సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. శుభ్‌మన్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం.. ఓ అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. భారత్ కోసం ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా నేనెంతో ఎంజాయ్ చేస్తాను. గర్వంగా కూడా ఫీల్ అవుతాను’’ అంటూ యశస్వీ జైస్వాల్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కొంతమంది అభిమానులతో ముచ్చటించినప్పుడు.. ఆ యువ ఆటగాడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో అఖండ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 152/7 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 15.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 156 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభం నుంచే విరుచుకుపడిన అతను.. తొలుత 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అదే దూకుడులో శతకం చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. చివర్లో శుభ్‌మన్ జోరందుకోవడంతో, అతని శతకం మిస్ అయ్యింది.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 14 , 2024 | 05:02 PM