Share News

T20 Worldcup: ప్యాట్ కమిన్స్ అత్యంత అరుదైన రికార్డు.. ప్రపంచకప్‌లో వరుసగా రెండ్రో హ్యాట్రిక్!

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:32 AM

ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ఒక్కసారి హ్యాట్రిక్ వికెట్లు తీయడమే చాలా గొప్ప విషయం. అలాంటిది వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేస్తే అది అత్యంత అద్భుతం. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ తాజా ప్రపంచకప్‌లో ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాడు.

T20 Worldcup: ప్యాట్ కమిన్స్ అత్యంత అరుదైన రికార్డు.. ప్రపంచకప్‌లో వరుసగా రెండ్రో హ్యాట్రిక్!
Pat Cummins Hat trick

ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ఒక్కసారి హ్యాట్రిక్ వికెట్లు తీయడమే చాలా గొప్ప విషయం. అలాంటిది వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ (Hat trick) నమోదు చేస్తే అది అత్యంత అద్భుతం. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) తాజా ప్రపంచకప్‌లో ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు (Pat Cummins Hat trick). క్రికెట్ చరిత్రలో ఈ ఘనత నమోదు చేసిన తొట్ట తొలి బౌలర్‌గా నిలిచాడు. శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ ఈ రికార్డును సాధించాడు (T20 Worldcup)


మొదట బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టిన కమిన్స్.. తాజాగా అఫ్గానిస్తాన్‌తో (Aus vs Afg) జరిగిన మ్యాచ్‌లోనూ ఆ ఫీట్‌ను రిపీట్ చేశాడు. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతికి రషీద్ ఖాన్‌ను అవుట్ చేసిన కమిన్స్.. 20వ ఓవర్ తొలి బంతికి కరీమ్ జనత్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత బంతికే గుల్బాదిన్‌ను కూడా అవుట్ చేశాడు. వీరు ముగ్గురూ వేగంగా ఆడే క్రమంలో క్యాచ్‌లు ఇచ్చి వెనుదిరిగారు. డెత్ ఓవర్లలో చెలరేగిన కమిన్స అఫ్గాన్‌ను కట్టడి చేశాడు.


ఒకే ప్రపంచకప్‌లో రెండు హ్యాట్రిక్‌లు నమోదు చేసిన బౌలర్‌గా కమిన్స్ నిలిచాడు. అలాగే మొత్తం టీ20ల్లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్లు నలుగురు మాత్రమే ఉన్నారు. కమిన్స్ కంటే ముందు లసిత్ మలింగ (శ్రీలంక), టిమ్ సౌథీ (న్యూజిలాండ్), మార్క్ పాల్వోవిక్ (సెర్బియా), వసీమ్ అబ్బాస్ (మాల్టా) మాత్రమే రెండు హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. ఇక, ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో టీ20ల్లో రెండు హ్యాట్రిక్‌లు తీసినది కమిన్స్ మాత్రమే.

ఇవి కూడా చదవండి..

T20 World Cup 2024: ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన అఫ్ఘనిస్తాన్.. సరికొత్త రికార్డు


Virat Kohli: వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. మొట్టమొదటి ఆటగాడిగా అవతరణ


మరన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 23 , 2024 | 11:32 AM