ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paris Olympics 2024: మహిళా ఆర్చరీ క్వార్టర్ ఫైనల్లో ఓడిన దీపికా

ABN, Publish Date - Aug 03 , 2024 | 05:07 PM

పారిస్ ఒలింపిక్స్ 2024(paris olympics 2024)లో చివరి ఏడు రోజులు భారత్‌కు కీలకంగా మారాయి. ఈ క్రమంలో షూటింగ్‌లో దేశం మూడు పతకాలు సాధించగా, అందులో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. అయితే కొంతమంది పోటీదారులు మాత్రం ఈ రేసు నుంచి నిష్క్రమించారు. ఈ క్రమంలో మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్ ఈవెంట్‌లో దీపిక 4-6 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహ్యోన్‌ చేతిలో ఓడిపోయింది.

Deepika Kumari

పారిస్ ఒలింపిక్స్ 2024(paris olympics 2024)లో చివరి ఏడు రోజులు భారత్‌కు కీలకంగా మారాయి. ఈ క్రమంలో షూటింగ్‌లో దేశం మూడు పతకాలు సాధించగా, అందులో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. అయితే కొంతమంది పోటీదారులు మాత్రం ఈ రేసు నుంచి నిష్క్రమించారు. ఈసారి కూడా పీవీ సింధు పతకం ఆశించినప్పటికీ సాధించలేకపోయింది. సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ కూడా పతకాల ఆశలపై నీళ్లు చల్లారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నేడు పారిస్ క్రీడల ఎనిమిదో రోజున (ఆగస్టు 3న) జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో భారత్‌కు చెందిన దీపికా కుమారి(Deepika Kumari) మహిళల వ్యక్తిగత ఆర్చరీ(Womens Archery) ఈవెంట్‌లో జర్మనీకి చెందిన మిచెల్ క్రోపెన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.


క్వార్టర్ ఫైనల్

ఈ క్రమంలోనే మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్ ఈవెంట్‌లో దీపిక 4-6 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహ్యోన్‌ చేతిలో ఓడిపోయింది. దీంతో దీపిక 6-4తో క్వార్టర్స్‌లో ఓటమిపాలైంది. మరోవైపు నేడు పురుష ఆటగాళ్లు నిశాంత్ దేవ్ బాక్సింగ్‌లో, గగన్‌జీత్ భుల్లర్, శుభంకర్ శర్మ గోల్ఫ్‌లో పోటీపడనున్నారు. షూటింగ్‌లో మహిళల స్కీట్ రౌండ్ మొదలుకానుండగా ఇందులో మహేశ్వరి చౌహాన్, రైజ్ ధిల్లాన్ బరిలోకి దిగుతున్నారు.


మరో పోటీలో

మరో ఆర్చరీ పోటీలో ఇండియాకు చెందిన భజన్ కౌర్(bhajan kaur) నిష్క్రమించింది. భజన్ కౌర్ ఇండోనేషియాకు చెందిన దియాండా చోర్నిసాతో తలపడింది. మూడు సెట్ల తర్వాత భజన్ కౌర్ 4-2తో ఆధిక్యంలో నిలిచింది. కాగా భారత ఆర్చర్ భజన్ కౌర్ వ్యక్తిగత రౌండ్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. 6-5తో ఇండోనేషియా ప్లేయర్ చేతిలో ఓడింది. దీనికి ముందు మహాకుంభ్ గేమ్స్‌లో ఎనిమిదో రోజు 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ ఫైనల్‌లో విఫలమైంది.

భావోద్వేగానికి లోనై

ఈరోజు హ్యాట్రిక్ పతకాలు సాధిస్తుందని భావించిన మను భాకర్ 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత మను భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకుంది. తాను భయాందోళనకు గురయ్యానని, ఉత్తమ షాట్ ఇచ్చినప్పటికీ, దురదృష్టవశాత్తు అది సరిపోలేదని అంగీకరించింది. ఇది తెలిసిన నెటిజన్లు ఆమెకు మద్దతు పలుకుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే మను భాకర్ ఈ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి, భారత్ నుంచి అలా సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.


Also Read:

Manu Bhaker: హ్యాట్రిక్ మిస్.. త్రుటిలో మూడో పతకాన్ని చేజార్చుకున్న మను బాకర్.. నాలుగో స్థానంతో సరి..!


Manu Bhaker: మను భాకర్ ఒలింపిక్ విక్టరీ తర్వాత క్యూ కట్టిన 40కిపైగా బ్రాండ్స్.. ఇక ఆదాయం ఏంతంటే..


For More Sports News and Telugu News..

Updated Date - Aug 03 , 2024 | 05:40 PM

Advertising
Advertising
<